Advertisementt

బిగ్ బాస్: లాస్ట్ వీక్ నామినేషన్స్ గరం గరంగా

Mon 09th May 2022 03:25 PM
bigg boss,bigg boss ott,bigg boss non stop,bindu vs akhil,nataraj vs bindu,ariyana vs mitraaw sharma  బిగ్ బాస్: లాస్ట్ వీక్ నామినేషన్స్ గరం గరంగా
Bigg Boss Non Stop: 11th week nominations బిగ్ బాస్: లాస్ట్ వీక్ నామినేషన్స్ గరం గరంగా
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ చివరి దశలో ఉంది. బిగ్ బాస్ 11 వారం లోకి అడుగుపెట్టింది. ఈ వారం నామినేషన్స్ ఉండవేమో అనుకున్నారు ఇంటి సభ్యులు. ఈ ఆదివారం ఆశు రెడ్డి ఎలిమినేట్ అవ్వగా.. ఇంకా హౌస్ లో ఎనిమిదిమంది ఇంటి సభ్యులు ఉన్నారు. అయితే ఈ వారం కూడా బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియ చేపట్టారు. సోమవారం వచ్చింది అంటే బిగ్ బాస్ హౌస్ మొత్తం నామినేషన్స్ ప్రక్రియతో హీటెక్కియిపోతుంది. అదే హీట్ లాస్ట్ వీక్ నామినేషన్స్ లోనూ నడిచింది. బిగ్ బాస్ ఆదేశాల మేరకు హౌస్‌ లోని సభ్యులు నామినేట్ చేయాలనుకున్నవారిని ముగ్గురిని ఎంచుకోవాలి. వాళ్లను గార్డెన్ ఏరియాలో ఉన్న ఎగ్జిట్ బోర్డు కింద నిల్చోబెట్టాలి. దానికి తగిన కారణం చెప్పి ముగ్గురిని నామినేట్ చెయ్యాలి.

ఈ ప్రాసెస్ లో బిందు మాధవి కి అఖిల్ కి మధ్యన బిగ్ ఫైట్ జరిగింది. నాకు బుర్ర లేదు అందుకే ఆలోచించడం లేదు అంది బిందు. అఖిల్ కూడా ఎక్కడా తగ్గలేదు. తర్వాత నటరాజ్ కి బిందు మాధవికి మధ్యన ఫైట్ హోరా హోరీగా జరిగింది. అందులో నటరాజ్ మాస్టర్ బిందు మీ ఫాదర్ మిమ్మల్ని సరిగా పెంచడంలో ఫెయిల్ అయ్యారు అన్నాడు. అలాగే నేను గేమ్ ఆడుతున్నా నీలా బెడ్ పై కాళ్ళు ఊపుకుంటూ లేను అన్నాడు. దానికి మా ఫాదర్ ని ఇందులోకి ఎందుకు లాగుతున్నారు అంటూ గొడవ పడింది బిందు. తర్వాత అరియానకి - మిత్ర శర్మకి చాలా రచ్చ జరిగింది. బిందు vs అఖిల్, నటరాజ్ vs బిందు, అరియనా vs మిత్ర శర్మ అన్నట్టుగా సాగిన ఈ నామినేషన్స్ ప్రక్రియలో లో ఎవరెవరు నామినేట్ అయ్యేరో ఈ రోజు నైట్ ఎపిసోడ్ లో తేలిపోతుంది. 

Bigg Boss Non Stop: 11th week nominations:

Bigg Boss OTT: 11th week nominations promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ