Advertisementt

ఇంటర్వ్యూ మధ్యలో వెళ్లిపోయిన బిగ్ బాస్ అశు

Tue 10th May 2022 12:55 PM
ashu reddy,ashu reddy interview,bigg boss buzz,anchor ravi,akhil  ఇంటర్వ్యూ మధ్యలో వెళ్లిపోయిన బిగ్ బాస్ అశు
Bigg Boss Ashu Reddy who left in the middle of the interview ఇంటర్వ్యూ మధ్యలో వెళ్లిపోయిన బిగ్ బాస్ అశు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నుండి 11 వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గా అశు రెడ్డి నిలిచింది. ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన అశు రెడ్డి.. ఎలాగోలా చివరి వారం దాకా నెట్టుకు వచ్చింది. టాస్క్ పెరఫార్మెన్స్ లేదు, కేవలం గ్లామర్ షో ద్వారానే అశు ఇంతకాలం బిగ్ బాస్ హౌస్ లో ఉండగలిగింది. ఇక అజయ్ ఎలిమినేట్ అయ్యాక అశు రెడ్డి పూర్తిగా లో యాంగిల్ లో కనిపించింది. అయితే అశు రెడ్డి ఆదివారం ఎలిమినేట్ అవ్వగా.. తర్వాత బిగ్ బాస్ బజ్ లో యాంకర్ రవి ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో రవి అశు కి వెల్ కామ్ చెబుతూ.. కంగ్రాట్స్ కూడా చెప్పాడు. కంగ్రాట్స్ ఎందుకు అని అశు రెడ్డి అడగగా.. ఎప్పుడో బయటకు రావాల్సిన నువ్వు ఇప్పుడోచ్చావ్‌, గుడ్‌ జర్నీ అని ఆటపట్టించాడు. ఆ తర్వాత నీ గేమ్ చూస్తే.. వరస్ట్‌ కెప్టెన్‌, వరస్ట్‌ హౌజ్‌మేట్‌, వరస్ట్‌  సంచాలక్‌, వరస్ట్ బిహెవీయర్‌ అన్ని వరస్ట్‌ వరస్ట్‌ కంప్టీట్‌గా నీకే వచ్చింది అన్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో నామినేట్ చెయ్యడానికి అశు భయపడిందా అని కూడా అడిగాడు. దానికి అశు రెడ్డి హౌస్ లో మనమే కాదు, మనకన్నా వెధవలు చాలామంది ఉన్నారని అంది. నిన్ను నువ్వు వెధవ అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నాడు రవి. ఇక అశు రెడ్డి అవసరానికి మించి ఒకరి దగ్గర అలిగావు, వారిపై నీకు ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాడు రవి. తర్వాత అఖిల్ ఫోటో ఇవ్వగా.. నాకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కంటెండర్ ఛాన్స్ ఇచ్చి ఉన్నట్టయితే గేమ్ వేరేలా ఉండేది. ఒకవేళ ఈ వారం హౌస్ లో ఉండి ఉంటే అఖిల్ ని నామినేట్ చెసాదాన్ని అంటూ అఖిల్ ఫోటో పగలగొట్టింది. ఇక హౌస్ లో ఓ సంఘటనతో చాలా లో అయ్యావు.. దానికి కారణం తెలుసుకోవచ్చా.. నువ్వు కంఫర్ట్ గా ఉన్నావా అని అడగగానే.. అశు లేచి ఆ ఇంటర్వ్యూ నుండి బయటికి వెళ్ళిపోయింది.

Bigg Boss Ashu Reddy who left in the middle of the interview:

Ashu Reddy post-elimination interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ