గత ఏడాది నాగ చైతన్య - సమంత విడాకులు తర్వాత ఆస్ట్రాలజర్ వేణు స్వామి పేరు మీడియాలో బాగా హైలెట్ అయ్యింది. చైతు - సమంత వివాహం అప్పుడే వీరు ఎంతో కాలం కలిసి ఉండరని చెప్పాను అని, అఖిల్ పెళ్లి కూడా నిశ్చితార్ధం తర్వాత ఆగిపోతుంది అని చెప్పినవన్నీ నిజాలయ్యాయి అంటూ వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఈ మధ్యన సమంత జాతకం చాలా బాగుంది అని, ప్రభాస్ తో సినిమాలు చేసే నిర్మాతలు ఇబ్బందులు పడతారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు ఆయన. ఇప్పుడు తాజాగా నయనతార జాతకంలో పెళ్లి అచ్చిరాదు అని, ఆమెకి ఇప్పటికే రెండుసార్లు పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది అని.. నయనతార జాతకంలో గురువు నీచంలో ఉన్నారని అందుకనే ఆమె వైవాహిక జీవితం అంత సవ్యంగా సాగదంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
జూన్ 9 న నయనతార - విగ్నేష్ శివన్ ల వివాహం తిరుమల తిరుపతి శ్రీవారి సన్నిధిలో జరగబోతుంది అంటూ ప్రచారం జరగడమే కానీ, అటు నయన్, ఇటు విగ్నేష్ ఎవరూ పెళ్లి విషయమై అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇలాంటి టైం లో ఆస్ట్రాలజర్ వేణుస్వామి నయనతారకు పెళ్లి అచ్చిరాదు అంటూ చేసిన కామెంట్స్ కలకలం సృష్టిస్తున్నాయి. మరి ఈ విషయం అలా ఉంటే నయనతార అటు స్టార్ హీరోలతోనే కాదు, ఇటు ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలోను సినిమాలు చేస్తుంది. అలాగే విగ్నేష్ శివన్ తో కలసి రౌడీ పిక్చర్ పేరుతొ సినిమాలు కూడా నిర్మిస్తుంది.