బిగ్ బాస్ నాన్ స్టాప్ లాస్ట్ వీక్ నామినేషన్స్ ప్రక్రియ ఎంతో వేడిగా కాదు, చాలా రంజుగా హౌస్ ని హీటెక్కిస్తోంది. ముగ్గురిని పోల్ కింద నిలబెట్టి వారు ఎందుకు టాప్ 5 కి వెళ్లకూడదో తగినకారణాలు చెప్పమంటే నిన్నటి ఎపిసోడ్ లో బిందు మాధవి అఖిల్, నటరాజ్, మిత్ర శర్మలని నిలబెట్టింది. అఖిల్ కి బిందు కి గొడవ జరగగా.. నటరాజ్ మాస్టర్ - బిందు మాధవికి మధ్యన రచ్చ జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ గొడవ పడ్డారు. ఇక అరియనా, అనిల్ నామినేషన్స్ తర్వాత ఈ ప్రక్రియని ఈ రోజుకి వాయిదా వెయ్యగా, ఈ రోజు నటరాజ్ మాస్టర్.. బిందు మాధవి, అరియనా, బాబా మాస్టర్ లను పోల్ కింద నించోబెట్టాడు. బిందు ని నెగెటివిటి పర్సన్ వి అంటూ నటరాజ్ రెచ్చిపోయాడు.
మరి నువ్వు మాత్రం నెగెటివ్ కదా.. పాజిటివా అంటూ బిందు రెచ్చగొట్టింది. నువ్ గేమ్ ఆడవు, ఇలాంటి మాటలతోనే ఇన్ని వారాలు హౌస్ లో ఉన్నావ్ అన్నాడు నటరాజ్. తర్వాత బాబా ని ఉద్దేశించి రన్నింగ్ రేస్ లో అందరూ కష్టపడి పరిగెత్తుతూ ఉంటే 90 మీటర్స్ వచ్చాక ఒకాయన జాయిన్ అయ్యాడు. అది ఎంతవరకు న్యాయం అని నాటరాజ్ మాస్టర్ లాజిక్ చెప్పడంతో బాబా మాస్టర్ గట్టిగా నవ్వేశారు. నా దగ్గర ఎవిక్షన్ పాస్ ఉంది నేను వాడుకుంటానుగా నువ్వు నన్ను టాప్5 కి వెళ్ళొద్దన్నా ఆగను అన్నారాయన. మరోపక్క అఖిల్ యాంకర్ శివ, బిందు, అనిల్ ని పోల్ కింద నించోబెట్టాడు. దానికి శివ అఖిల్ ఎమోషనల్ గా, స్ట్రాంగ్ అని నిరూపించుకోవాలని చూస్తున్నాడు అన్నాడు. అలాగే బిందు మాధవి కూడా అఖిల్ తో గట్టిగానే పోరాడింది. మిత్ర శర్మ కూడా నామినేషన్స్ లో ఫైర్ అవ్వగా.. నటరాజ్ - బిందు మాధవి మధ్యలో జరిగిన ఫైట్ లో వేరే లెవల్ అన్నట్టుగా లో బిందు మాధవి మహంకాళి ఫోజ్ ఇవ్వగా.. నటరాజ్ నువ్వు సూర్పనకవి నేను నిన్ను బాణంతో నాశనం చేసే లక్షణుడిని అంటూ ఫోజులు ఇచ్చాడు.