సుడిగాలి సుధీర్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో టాప్ కమెడియన్. అంతేకాకుండా ఢీ డాన్స్ షో లో రష్మీ తో కలిసి సందడి చేసిన సుధీర్ జబర్దస్త్ లో కనిపిస్తున్నాడు కానీ, ఢీ డాన్స్ షో లోకి రావడం మానేసాడు. కారణం ఆయన్ని మల్లెమాల తప్పించింది అని, కాదు సుధీర్ కావాలనే ఢీ షో నుండి తప్పుకున్నాడు అని, లేదు సుధీర్ చేస్తున్న సినిమాల వలన అతనికి బిజీ షెడ్యూల్ ఉండడంతో ఢీ డాన్స్ నుండి తప్పుకున్నాడు అంటూ ఇలా ఏవేవో వినిపించినా.. సుధీర్ ఫాన్స్ మాత్రం ఆ విషయంలో శాటిస్ ఫై అవ్వలేదు.
అయితే సుధీర్ హోస్ట్ గా వస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీలో మథర్స్ డే స్పెషల్ గా అమ్మాయిలు vs ఆంటీలు షో లో సుధీర్ ని ఆయన ఫాన్స్ అన్న ఢీ ఎందుకు మానేశావ్ అన్నా.. నువ్వొచ్చే షోస్ ని చూస్తూ వీకెండ్ ని ఎంజాయ్ చేస్తున్నాం అని అడగగా.. దానికి సుధీర్ ఢీషోను నేనెప్పుడు ఆపాను.. కొంచెం పాజ్ ఇచ్చాను.. ఐ విల్ బి బ్యాక్ వెరీ సూన్ అంటూ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు సుధీర్. ఇప్పటివరకు సుధీర్ అన్న ఢీ ఎందుకు మానేశాడో అనే కన్ఫ్యూజన్ లో ఉన్న ఫాన్స్ సుధీర్ ఆన్సర్ తో కూల్ అయ్యారు. మళ్ళీ సుధీర్ అన్నా రష్మీ జోడి ఢీ స్టేజ్ పై సందడి చెయ్యడం ఖాయమంటున్నారు. మరోవైపు సుడిగాలి సుధీర్ వెండితెర మీద కూడా గాలోడు, కాలింగ్ సహస్ర సినిమాల షూటింగ్స్ తో బిజీగా వున్నాడు.