Advertisementt

బిగ్ బాస్: ఈ వారం అందరికి టెన్షనే

Wed 11th May 2022 09:41 AM
bigg boss,bigg boss non stop,akhil,baba bhasker,nataraj,ariyana,mitra,bindu madhavi  బిగ్ బాస్: ఈ వారం అందరికి టెన్షనే
Bigg Boss Non Stop: Last week nominations బిగ్ బాస్: ఈ వారం అందరికి టెన్షనే
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ పూర్తి కావడానికి ఎంతో సమయం లేదు. మరొక్క వారమే గ్యాప్ ఉంది. రేపు ఆదివారం కాకుండా వచ్చే ఆదివారమే బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే తో ముగియబోతుంది. ఈ వారం ఏ ముగ్గురు టాప్ 5 లో ఉండేందుకు అర్హులు కారో చెప్పమన్నప్పుడు.. హౌస్ లో పెద్ద యుద్ధమే నడిచింది. టైటిల్ ఫెవరెట్స్ అఖిల్ vs బిందు మాధవి అన్నట్టుగా సాగిన ఈ నామినేషన్స్ లో నటరాజ్ మాస్టర్ అలాగే బిందు మాధవికి మధ్యన పెద్ద గొడవ జరిగింది. ఇక అందరూ మిత్రా.. బిందూని టార్గెట్ చేస్తుంది అనుకుంటే.. అనూహ్యంగా తనకి సపోర్ట్ చేసిన బాబా భాస్కర్ టాప్ 5 కి అర్హులు కారు అనేసింది. అరియనా కి మిత్రా కి బాగా గొడవ జరిగింది. అయితే బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఈ వారం నేరుగా అందరూ నామినేట్ అయ్యారు అనగానే.. గత రెండు రోజులుగా నామినేషన్స్ అంటూ హౌస్ సభ్యుల మధ్యన గొడవ పెట్టి మరీ బిగ్ బాస్ కావాల్సిన ఫుటేజ్ లాక్కున్నాడని అనిపించింది. 

ఈ వారం బాబా భాస్కర్, బిందు మాధవి, నటరాజ్, అఖిల్, మిత్ర, శివ, అరియనా, అనిల్ ఇలా హౌస్ లో ఉన్నవాళ్ళంతా నామినేషన్స్ కి వెళ్లగా.. బాబా భాస్కర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండడంతో ఆయన టాప్ 5 కి వెళ్లే అవకాశం ఉంది. ఇక మిగిలిన వారిలో ఎవరు టాప్ 5 కి వెళతారు, ఎవరు ఇంట్లోనుండి ఒక వారం ముందే వెళతారనే దాని మీద అందరిలో ఇంట్రెస్ట్ మొదలైతే.. హౌస్ మేట్స్ మధ్యన టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అఖిల్, బిందు, శివ సేఫ్ గానే ఉన్నా.. మిగిలిన వారిలో ఎవరు ఎలిమినేట్ అయ్యి ఎవరు టాప్ 5 కి వెళతారో చూడాలి. 

Bigg Boss Non Stop: Last week nominations:

Bigg Boss Non Stop: Yesterday episode highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ