సూపర్ స్టార్ మహేష్ - పరశురామ్ కలయికలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. మహేష్ ఫాన్స్ మాత్రమే కాదు, సాధారణ సినిమా లవర్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న సర్కారు వారి పాట ఓవర్సీస్ మాత్రమే కాదు, ఇక్కడ తెలంగాణలోనూ ప్రీమియర్స్ పూర్తి చేసుకుంది. హైదరాబాద్ లో ఉదయం 4 గంటల నుండే నాలుగు థియేటర్స్ లో సర్కారు వారి పాట హడావిడి మొదలైపోయింది. ఇక సినిమా చూసిన మహేష్ ఫాన్స్ సినిమా సూపర్ అంటుంటే.. సాధారణ ఆడియన్స్ మాత్రం జస్ట్ ఏవరేజ్ అని తెల్చేయ్యడం గమనార్హం. ప్రమోషన్స్ లో సినిమా సూపర్ హిట్టు, కళావతి సాంగ్ తో మ్యాజిక్ చెయ్యడం సినిమాకి మరింత ప్లస్సు, సర్కారు వారి పాట ట్రైలర్ తోనే ఆడియన్స్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసారు అన్నారు.
కానీ సినిమా లో ఫస్ట్ హాఫ్ లో ఫన్ జెనరేట్ అయ్యింది, మహేష్ బాబు తన కేరెక్టర్ కి 100 పర్సెంట్ న్యాయం చేసారని, సినిమా మొత్తం మహేష్ భుజాలపై మోసారని, కీర్తి సురేష్ - వెన్నెల కిషోర్ మధ్యన కామెడీ సీన్స్ ఫన్ ని జనరేట్ చేశాయని, కీర్తి సురేష్ పెరఫార్మెన్స్, కీర్తి సురేష్ - మహేష్ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది అని, ఒక్కమాటలో మహేష్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు అంటుంటే.. కొందరు.. కథనం వీక్ గా ఉంది, అలాగే లాజిక్ లేని సన్నివేశాలు ఆడియన్స్ కి తలనొప్పి, సెకండ్ హాఫ్ అయితే రాడ్డు అంటూ సర్కారు వారి పాటకి సోషల్ మీడియా రివ్యూస్ ఇస్తున్నారు.