సుడిగాలి సుధీర్ అంటే కేరాఫ్ అడ్రెస్స్ ఈటివినే, ఈటివి లో సుధీర్ జబర్దస్త్ తో బాగా పాపులర్ అవడమే కాదు, రష్మీ తో లవ్ ట్రాక్ అంటూ బాగా హైలెట్ అయ్యాడు. ఆ తర్వాత ఈటీవిలోనే సుధీర్ ఢీ డాన్స్ షో లో రెండు సీజన్స్ లో చాలా సరదాగా ప్రదీప్, ఆది, రష్మీ లతో చాలా కామెడీ చేసేవాడు. ఇక రీసెంట్ గా ఈటీవిలోనే శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకరింగ్ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేసే సుధీర్ అటు వెండితెర మీద హీరోగా బిజీగా మారాడు. ఇక ఈమధ్యన ఢీ షో లో సుధీర్ కనిపించకపోవడంతో అయన ఫాన్స్ హార్ట్ అయ్యారు కూడా. అయితే సుధీర్ త్వరలోనే మళ్ళీ ఢీ డాన్స్ షోలోకి వస్తాను అని చెప్పాడు.
అయితే మొన్నామధ్యన వాలెంటైన్స్ ప్రోగ్రాం కి రష్మీ తో కలిసి సుడిగాలి సుధీర్ సడన్ గా స్టార్ మా లో కనిపించి షాకిచ్చాడు. ఇక ఇప్పుడు సుధీర్ స్టార్ మా లో సింగర్ ప్రోగ్రాం కి అనసూయ తో కలిసి యాంకరింగ్ చెయ్యబోతున్నాడు. సూపర్ సింగర్ జూనియర్ షో కి సుధీర్ - అనసూయ కలిసి యాంకరింగ్ చెయ్యగా, చిత్ర, మనో, హేమచంద్ర, రానిన రెడ్డి లు జేడ్జ్ గా మొదలు కాబోతున్న ప్రోగ్రాం ప్రోమో వదిలారు. అందులో పిల్లలు సుధీర్ ని ఓ ఆట ఆడుకోగా.. అనసూయ అయితే బైక్ పై ఎంట్రీ ఇవ్వడం సూపర్బ్ గా ఉంది. సుధీర్ ని జూనియర్ సింగర్స్ ఆటపట్టించడం ప్రోమో లో హైలెట్ అయ్యింది. మరి ఈ ప్రోగ్రాం కి సుధీర్ కూడా యాంకర్ గా వస్తున్నాడు అంటే.. సుధీర్ కూడా మెల్లగా ఈటీవికి దూరమవుతున్నాడా? ఇప్పటికే ఢీ వదిలేసాడు? అంటూ ఆయన ఫాన్స్ కంగారు పడినా.. మరోపక్క స్టార్ మా స్టేజ్ పై సుధీర్ అన్నా అంటూ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.