Advertisementt

SVP: మహేష్-పరశురామ్ పారితోషకాలు

Sat 14th May 2022 11:28 PM
mahesh babu,parasuram,sarkaru vaari paata,mahesh babu and parasuram,r sarkaru vaari paata collections  SVP: మహేష్-పరశురామ్ పారితోషకాలు
Parasuram and Mahesh remuneration for SVP revealed SVP: మహేష్-పరశురామ్ పారితోషకాలు
Advertisement
Ads by CJ

సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయ్యింది.. సినిమాకి మంచి టాక్ వచ్చింది.. కలెక్షన్స్ కూడా అదిరిపోతున్నాయి.. కానీ సోషల్ మీడియాలో SVP పై నెగటివ్ ప్రచారం మహేష్ ఫాన్స్ కి కునుకురానివ్వడం లేదు. అదలా ఉంటే.. సర్కారు వారి పాటని భుజాల మీద మోసి, సినిమా విజయంలో మేజర్ పార్ట్ ని సొంతం చేసుకున్న మహేష్ బాబు సర్కారు వారి పాట కి తీసుకున్న పారితోషకంపై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తుంది. అలాగే గీత గోవిందం సక్సెస్ తర్వాత స్టార్ హీరో మహేష్ తో సినిమా చేసిన పరశురామ అందుకున్న పారితోషకమై అందరిలో ఆసక్తి ఉంది.

అయితే సర్కారు వారి పాటకి పరశురామ్ కి 10 కోట్ల పారితోషకం ఇచ్చారట. అంతేకాకుండా మహేష్ బాబు 40 నుండి 50 కోట్ల మధ్యలో సర్కారు వారి పాటకి పారితోషకం అందుకున్నారని సినిమాకి పెట్టె బడ్జెట్ ని బట్టి మహేష్ బాబు తన రెమ్యునరేషన్ అడుగుతారని అంటుంటే.. ఏం పర్లేదు మా మహేష్ అన్న ఎంత తీసుకున్నా దానికి ఒంక పెట్టడానికి లేదు. ఎందుకంటే మహేష్ బాబు ఎంతోమంది పసి హృదయాలను బ్రతికిస్తున్నారు, ఎంతోమంది చిన్నారులకి హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు.. సో మహేష్ ఎంత తీసుకున్నా ఫికర్ లేదు అంటున్నారు మహేష్ ఫాన్స్.

Parasuram and Mahesh remuneration for SVP revealed:

Mahesh Babu and Parasuram remuneration for Sarkaru Vaari Paata

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ