Advertisementt

సర్కారు సెలెబ్రేషన్స్ స్టేజ్ పై మహేష్ డాన్స్

Mon 16th May 2022 09:14 PM
mahesh babu,sarkaru vaari paata,svp ma ma mass celebrations,mahesh abbu dance steps  సర్కారు సెలెబ్రేషన్స్ స్టేజ్ పై మహేష్ డాన్స్
Mahesh Babu mass Dance steps at Sarkaru Vaari paata Celebrations సర్కారు సెలెబ్రేషన్స్ స్టేజ్ పై మహేష్ డాన్స్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ మ్యానియా లో ఉన్నారు. ఈ రోజు కర్నూల్ లో మహేష్ ఫాన్స్ మధ్యన సర్కారు వారి పాట మా.. మా.. మాస్ సెలెబ్రేషన్స్ కి మహేష్ బాబు చాలా సింపుల్ గా స్టైలిష్ గా హాజరయ్యారు. ఈ సినిమా తనకి బాగా నచ్చింది అని, ఫ్యామిలీ తో కలిసి సర్కారు వారి పాట చూసిన తర్వాత తన కొడుకు గౌతమ్ నాన్న నువ్వు చాలా అందంగా కనిపించావు కొత్తగా కనిపించావు అని అనడంతో ఎంతో హ్యాపీ గా అనిపించింది అని, ఈ క్రెడిట్ అంతా పరశురాం కే దక్కుతుంది.. అంత బాగా ఆ కేరెక్టర్ ని పరశురామ్ డిజైన్ చేసారు అని మహేష్ చాలా అందంగా స్పీచ్ ఇచ్చారు. అభిమానులు చూపించే ప్రేమ తన అదృష్టమని మాట్లాడిన మహేష్ బాబు స్టేజ్ పై డాన్స్ చెయ్యడం అందరిని ఆకర్షించడం కాదు.. మహేష్ ఫాన్స్ లో ఫుల్ జోష్ ని నింపింది. 

మా.. మా.. మహేశా అనే మాస్ సాంగ్ కి స్టేజ్ పై డాన్సర్స్ స్టెప్స్ వేస్తుండగా.. ఆ సాంగ్ లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా డాన్సర్స్ తో కాలు కదుపుతూ.. మహేష్ ఫాన్స్ ని ఉర్రతలూగిస్తుంటే,. మహేష్ సడన్ గా స్టేజ్ పైకి వెళ్లి మా..మా.. మహేశా సాంగ్ కి అదిరిపోయే స్టెప్ ని థమన్ తో కలిసి చెయ్యడం మహేష్ ఫాన్స్ కి పూనకాలు తెప్పించింది. మహేష్ బాబు స్టెప్స్ వెయ్యడం ఆపేసినా  ఆ మాస్ సాంగ్ ప్లే అవుతున్నంతసేపు ఆ డాన్స్ మూడో లోనే మహేష్ ఉన్నట్టుగా జేబులో చేతులు పెట్టుకుని మరీ కనిపించారు మహేష్. మహేష్ డాన్స్ పిక్స్ మీ కోసం..

Mahesh Babu mass Dance steps at Sarkaru Vaari paata Celebrations :

Mahesh Babu mass Dance steps at Sarkaru Vaari paata ma Ma Mass Celebrations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ