Advertisementt

బిగ్ బాస్ బజ్: నటరాజ్ మామూలోడు కాదు

Mon 16th May 2022 10:37 PM
natraj master,bigg boss non stop,bigg boss,bigg boss buzz,anchor ravi,bindu  బిగ్ బాస్ బజ్: నటరాజ్ మామూలోడు కాదు
Bigg Boss Non Stop: nataraj Master interview highlights బిగ్ బాస్ బజ్: నటరాజ్ మామూలోడు కాదు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఎక్కువ ఎమోషనల్ పర్సన్ గా కనిపించిన నటరాజ్ మాస్టర్ టాప్ 5 కి వెళతాడనుకుంటే.. అతని యాటిట్యూడ్ వలన 11 వ వారంలోనే ఎలిమియేట్ అయ్యి బయటికి రావాల్సి వచ్చింది. టాస్క్ ల విషయంలో నెంబర్ 1 గా నిలిచిన నటరాజ్ మాస్టర్ ఎమోషన్స్ వలన అతను హౌస్ లో ఉండడానికి పనికి రాడు అని ప్రేక్షకులు డిసైడ్ చెయ్యడంతో అతను లాస్ట్ వీక్ లో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే స్టేజ్ పై నార్మల్ గానే ఉన్న నటరాజ్ మాస్టర్.. బిగ్ బాస్ బజ్ లో మళ్ళీ మాములుగా ఎమోషనల్ గా మాట్లాడాడు. యాంకర్ రవి నటరాజ్ మాస్టర్ ని ఇంటర్వ్యూ చెయ్యడానికి రెడీ అయ్యి వెల్ కం చెప్పాడు. మీరు హౌస్ లో అతి ఎమోషన్స్ వలనే ఎలిమియేట్ అయ్యారు .. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి అన్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో కొందరు వెన్నుపోటు పొడిచారు అన్న నటరాజ్ ని బిందు మాధవి తండ్రిని మీరు అలా అనొచ్చా అని రవి అడిగాడు. నా కూతురుని బయటికి తీసి మాట్లాడితే నేను ఊరుకోను. అందుకే నేను ఆయన్ని అన్నాను.. కానీ సారి చెప్పాను అంటే.. రవి మరి మీ కూతురు ఇవన్నీ పెద్దయ్యాక చూస్తే అనగానే.. నువ్వు సీజన్ 5 లో నీ కూతురు మీద ఒట్టేశావ్.. అది చాలా తప్పు, నువ్వు నన్ను పర్సనల్ టార్గెట్ తో ఇంటర్వ్యూ చేస్తున్నావ్.. అంటూ నటరాజ్ రవి కే షాకిచ్చాడు. దానికి రవి సీజన్ 5 గురించి మాట్లాడొద్దు మాస్టర్.. ఇప్పుడు నాన్ స్టాప్ గురించి మాట్లాడుకుందాం అన్నా సరే నటరాజ్ రవిని ఇరుకున పెడుతూనే ఉన్నాడు. ఇక హౌస్ లో శివ, బిందు, మిత్ర, అరియనా ద్రోహులు అని, బాబా భాస్కర్, అఖిల్, అనిల్ నమ్మకంతో ఉంటారని చెప్పాడు. 

ఇక నన్ను నామినేషన్స్ లో బిందు రీజన్స్ లేకుండా నామినేట్ చేసి ఏదోకటి రెచ్చగోట్టెది.. కానీ నా గేమ్ గురించి మాట్లాడమను అనగానే రవి.. కాదు మాస్టర్ బిందు పర్సనల్స్ ఎప్పుడూ తియ్యలేదు, ఆమె హౌస్ కి సంబంధించి మాట్లాడింది అన్నాడు. కానీ నటరాజ్ ఎప్పటిలాగే ఒప్పుకోకుండా రవి మీద ఇంటర్వ్యూ చివరి వరకు ఫైట్ చేస్తూనే ఉన్నాడు.

Bigg Boss Non Stop: nataraj Master interview highlights:

Natraj Master eliminated from Bigg Boss non stop

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ