బిగ్ బాస్ నాన్ స్టాప్ లాస్ట్ వీక్ లోకి ఎంటర్ అయ్యింది.. గ్రాండ్ ఫినాలే కి సమయం దగ్గరపడుతున్న కొద్దీ అందరిలో ఉత్కంఠ పెరిగిపోతుంది. ఫైనల్ గా బిగ్ బాస్ నాన్ స్టాప్ ట్రోఫి అనేది బిందు మాధవి అండ్ అఖిల్ చుట్టూనే తిరుగుతుంది. కానీ బాబా భాస్కర్, శివ కూడా స్ట్రాంగ్ గానే కనబడుతున్నారు. అనిల్, అరియనా, మిత్ర శర్మలు చాలా వీక్ గా ఉన్న కంటెస్టెంట్స్, అసలు వారు టాప్ 7 లోకి ఎలా వెళ్లారో ఎవరికీ అర్ధం కావడం లేదు. అయితే ఆదివారం ఎలిమినేషన్స్ లో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాక హౌస్ మేట్స్ అందరిలో చాలా అనుమానాలు మొదలయ్యాయి.
బాబా భాస్కర్, బిందు కూర్చుని నటరాజ్ స్ట్రాంగ్ ప్లేయర్, అతనికన్నా వరెస్ట్ కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎలిమినేట్ అవ్వకుండా నటరాజ్ ఎలిమినేట్ అవడం ఏమిటో అన్నాడు బాబా. దానికి బిందు మాధవి టాస్క్ పెరఫార్మెన్స్ మాత్రమే కాదు, ఆడియన్స్ ఇంకా చాలా చూస్తున్నారు మాస్టర్ అందుకేనెమో అంది. అవును నీ మదిలో ఇద్దరు ముగ్గురు వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారు, నాకు ఇద్దరు వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారు. వారు ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్ కి వచ్చారు. అవును మాస్టర్ అందులో మిత్ర కూడా ఉంది అంది బిందు. ఆమె ఫైనల్ కి రావడం వెనుక ఎదో కారణం ఉంది. అసలు ఆ అమ్మాయి ఎలా ఫైనల్ కి వచ్చిందో అంటూ బాబా భాస్కర్, బిందు మాధవి మాట్లాడుకోవడం రాత్రి ఎపిసోడ్ లో హైలెట్ అయ్యింది.