ప్రభాస్ పక్కన సినిమా ఛాన్స్ వస్తే ఏ ఒక్క హీరోయిన్ కూడా వదులుకోరు. ఎగిరిగంతేసి మరీ ఓకె చెప్పేస్తుంది. అయితే ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కె లో దీపికా పదుకొనే, దిశా పటానీలతో రొమాన్స్ చేస్తున్నాడు. అలాగే సలార్ లో శృతి హాసన్ తో జోడి కట్టాడు. ఈ రెండు సినిమాలు ఇప్పుడు సెట్స్ మీద ఉండగా.. ఆదిపురుష్ లో కృతి సనన్ తో కలిసి నటించిన ప్రభాస్ ఆ షూటింగ్ ఎప్పుడో ఫినిష్ చేసేసారు. ఇక తర్వాత ప్రభాస్ మారుతి దర్శకత్వంలో చెయ్యబోయే మూవీ లో కోలీవుడ్ భామ మాళవిక మోహన్ అలాగే, శ్రీ లీల తో పాటుగా మరో హీరోయిన్ తో డ్యూయెట్స్ పాడనున్నారని అన్నప్పటికీ హీరోయిన్స్ పై ఇంకా క్లారిటీ రాలేదు.
ఇక తాజాగా ప్రభాస్-సందీప్ వంగా కలయికలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కబోతున్న స్పిరిట్ మూవీ లో ప్రభాస్ సరసన రష్మిక కానీ, లేదా కియారా కానీ నటిస్తుంది అని ప్రచారం జరగడమే కాదు, ఆల్మోస్ట్ కియారా అద్వానీ ఫిక్స్ అని, ఆమెని సందీప్ వంగా సంప్రదిస్తున్నారని బాలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలయ్యింది. ఎందుకంటే కబీర్ సింగ్ లో సందీప్ వంగా హీరోయిన్ కియారనే కాబట్టి. కానీ తాజాగా కియారా పీఆర్ టీం మాత్రం కియారా అద్వానీ, ప్రభాస్ మూవీలో నటించడం లేదు అని, స్పిరిట్ సినిమా కోసం తమని ఎవరూ ఇంతవరకూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. స్పిరిట్ లో ప్రభాస్ సరసన కియారా చేస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చెప్పారు.