Advertisementt

దీప్తి - షణ్ముఖ్ ల సపోర్ట్ అఖిల్ కే

Wed 18th May 2022 01:21 PM
shanmukh jaswanth,deepthi sunaina,akhil sarthak,bigg boss,bigg boss non stop,bigg boss ott  దీప్తి - షణ్ముఖ్ ల సపోర్ట్ అఖిల్ కే
Bigg Boss Non Stop: Shanmukh and Deepthi Supports Akhil Sarthak దీప్తి - షణ్ముఖ్ ల సపోర్ట్ అఖిల్ కే
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫస్ట్ సీజన్ లో ఎవరు విన్ అవుతారో అనే దాని మీద ఓటిటి ఆడియన్స్ కూడా కన్ఫ్యూషన్ లోనే ఉన్నారు. మొదట్లో అఖిల్ సార్థక్ బిగ్ బాస్ టైటిల్ ఫెవరెట్ గా కనబడితే చివరికి వచ్చేసరికి అంటే గత ఐదారు వారాల నుండి కూడా బిందు మాధవి ఓటింగ్స్ లో అఖిల్ కి గట్టి పోటీ ఇస్తూ టైటిల్ ఫెవరెట్ గా మారిపోయింది. దానితో వార్ వన్ సైడ్ కాస్తా.. ఇప్పుడు అఖిల్ - బిందు మధ్యలో టైటిల్ ట్రోఫీ దోబూచులాడుతోంది. ఓటింగ్స్ లోను రోజుకి ఒకరిని టాప్ లో ఉంచుతున్నారు నాన్ స్టాప్ ఓటర్లు. ఇక బిందు ఈసారి టైటిల్ గెలవాలంటూ ఆమె ఫాన్స్ సోషల్ మీడియాలో క్యాంపైన్ చేస్తున్నారు.

మరోపక్క అఖిల్ ఫాన్స్ అఖిల్ కి గట్టిగ మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు అఖిల్ గత సీజన్ రన్నర్ అయిన షణ్ముఖ్, అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ దీప్తి సునయన మద్దతు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. షణ్ముఖ్ జస్వంత్ గత సీజన్ లో బిగ్ బాస్ లోకి వెళ్లి అటు క్రేజు ఇటు ప్రేమికురాలి నమ్మకాన్ని, అలాగే బిగ్ బాస్ ట్రోఫీ ని కోల్పోయి హౌస్ నుండి బయటికి వచ్చాక దీప్తి సునయన బ్రేకప్ తో డల్ అయ్యాడు. తర్వాత తేరుకుని ఓ వెబ్ సీరీస్ చేస్తున్నాడు. అలాగే దీప్తి కూడా షణ్ముఖ్ తో బ్రేకప్ అయ్యాక కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి అఖిల్ కి సపోర్ట్ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అఖిల్ కి ఓట్స్ వెయ్యమంటూ దీప్తి-షణ్ముఖ్ లు క్యాంపైన్ చేస్తున్నారు.

Bigg Boss Non Stop: Shanmukh and Deepthi Supports Akhil Sarthak:

Shanmukh Jaswanth and Deepthi Sunaina Supports Akhil Sarthak

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ