Advertisementt

జబర్దస్త్-కామెడీ స్టార్స్ లో F3 సందడి

Wed 18th May 2022 03:37 PM
comedy stars dhamaka,f3 movie team,jabardasth,anil ravipudi,mehreen akur,sonal  జబర్దస్త్-కామెడీ స్టార్స్ లో F3 సందడి
F3 promotions on Jabardasth-Comedy Stars జబర్దస్త్-కామెడీ స్టార్స్ లో F3 సందడి
Advertisement
Ads by CJ

మే 27 న రిలీజ్ కాబోతున్న F3 ప్రమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి. ఇప్పటికే ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇవ్వడంతో పాటుగా బుల్లితెర మీద పాపులర్ టివి షోస్ లో F3 ని ప్రమోట్ చేస్తున్నారు అనిల్ రావిపూడి అండ్ టీం. గత శనివారం ఈటీవీ క్యాష్ ప్రోగ్రాంలో హీరోయిన్స్ తమన్నా, సోనాల్, సునిల్ తో కలిసి అనిల్ రావిపూడి F3 ని ప్రమోట్ చెయ్యగా.. ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ పై స్పెషల్ జేడ్జ్ గా అనిల్ రావిపూడి కనిపించారు. ఇంద్రజ, శ్రద్ద దాస్, అనిల్ రావిపూడి జెడ్జెస్ గా వస్తున్న జబర్దస్త్ ఎపిసోడ్ ఈ గురువారం ప్రసారం కాబోతుంది అది కూడా అనిల్ రావిపూడి సినిమాల స్పూఫ్స్ తో.

ఇక ఈవిటీలోనే కాదు, అటు స్టార్ మా లో పాపులర్ షో గా మారిన కామెడీ స్టార్స్ లోను అనిల్ రావిపూడి తన హీరోయిన్స్ మెహరీన్ కౌర్ అలాగే సోనాల్ తో పాల్గొన్న ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో F2 కి సీక్వెల్ గా రాబోతున్న నవ్వుల ఫ్రాంచైసీ F3 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి F3 ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ ఛేస్తున్నారు. నిర్మాత దిల్ రాజు F3 కి పెద్ద సినిమాల్లాగే టికెట్ రేట్స్ పెంచడం లేదు, ప్రేక్షకుడికి అందుబాటులోనే F3 టికెట్ రేట్స్ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో సినిమాపై ఆడియన్స్ ఆసక్తి మొదలయ్యేలా కనిపిస్తుంది. 

F3 promotions on Jabardasth-Comedy Stars:

Comedy stars dhamaka latest promo with F3 movie team

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ