Advertisementt

బిగ్ బాస్: ఆడపులిదే టైటిల్

Thu 19th May 2022 05:39 PM
bigg boss telugu ott,bigg boss,bigg boss non stop,bindu madhavi,akhil,akhil fans  బిగ్ బాస్: ఆడపులిదే టైటిల్
Bigg Boss Telugu OTT Title goes to.. బిగ్ బాస్: ఆడపులిదే టైటిల్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ వన్ దగ్గర నుండి బుల్లితెర ప్రేక్షకులు ఇప్పటి బిగ్ బాస్ ఓటిటి వరకు బాగా ఆదరించారు. సీజన్ 5 వరకు స్టార్ మా లో ప్రసారం అయిన బిగ్ బాస్ ఈసారి ప్రయోగాత్మకంగా ఓటిటిలో ప్రసారం చేసారు. 24 గంటల ఎంటర్టైన్మెంట్ అంటూ హడావిడి చేసినా.. చివరికి రోజుకి ఓ గంట డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ ప్రసారం చేసారు. ఇక హౌస్ లోకి 17 మంది అడుగుపెట్టగా.. మరో వైల్డ్ కార్డు బాబా భాస్కర్ తో కలిపి 18 మంది అవ్వగా.. వారానికి ఒకరి చొప్పున ఎలిమినేట్ అయ్యి హౌస్ ని విడిచి వెళ్లిన వారు వెళ్లగా ఫినాలే వీక్ కి ఫైనల్ గా 7గురు మిగిలారు. 

మిత్ర శర్మ, బాబా భాస్కర్, శివ, అఖిల్, అనిల్, బిందు మాధవి, అరియనా ఉండగా.. ఇందులో టైటిల్ ఫెవరెట్స్ గా బిందు మాధవి, అఖిల్ ఉన్నారు. అఖిల్ కి బిందు మాధవికి పోటాపోటీ ఓట్స్ వచ్చాయనే టాక్ సోషల్ మీడియాలో నడిచింది. సోషల్ మీడియాలో బిందు మాధవి తరచూ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది. ఆమె ఫాన్స్ బిందు టైటిల్ గెలవాలంటూ ఆమెని సపోర్ట్ చేస్తున్నారు. #BinduTheSensation, #BinduMadhavi #Aadapuli హాష్ టాగ్స్ తో ఆమెకి సపోర్ట్ చేస్తూ హడావుడి చేస్తున్నారు.

అయితే ఆదివారం అర్ధరాత్రి మొదలైన ఓటింగ్ లైన్ నిన్న బుధవారం అర్ధరాత్రితో క్లోజ్ అయ్యాయి. ఓటింగ్ పరంగా ఒక రోజు అఖిల్ టాప్ లో ఉంటే మరో రోజు బిందు టాప్ లో ఉన్నారన్నారు. ఫైనల్ గా అఖిల్ నెంబర్ వన్ అన్నప్పటికీ.. చివరికి బిందు మాధవిని బిగ్ బాస్ ఓటిటి ట్రోఫీ ఎగరేసుకుపోతున్నట్టుగా తెలుస్తుంది. ఫిజికల్ టాస్కులే కాదు హౌస్ లో ఉండే విధానం కూడా టైటిల్ గెలవడానికి కారణం అని అభిజిత్ నిరూపించినట్లే.. ఇప్పుడు బిందు మాధవి టాస్క్ పరంగా వీక్ అయినా ఆమె వ్యక్తిత్వానికి ముగ్దులై ఆమెని విన్నర్ ని చేసారు అంటున్నారు.

బిగ్ బాస్ ఓటిటి టైటిల్ బిందు చేతికి వెళ్లడం, అఖిల్ రెండో ప్లేస్ లో రన్నర్ గా సరిపెట్టుకోవాల్సి రావడంతో అఖిల్ ఫాన్స్ షాకవుతున్నారు.

Bigg Boss Telugu OTT Title goes to..:

Bigg Boss Telugu OTT: Shocking News For Akhil Fans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ