Advertisementt

వైరల్: NTR31 లుక్ పై RGV కామెంట్

Fri 20th May 2022 06:54 PM
rgv,ntr31 first look,ram gopal varma,ntr31,prashanth neel,ntr  వైరల్: NTR31 లుక్ పై RGV కామెంట్
Ram Gopal Varma on NTR31 first look వైరల్: NTR31 లుక్ పై RGV కామెంట్
Advertisement
Ads by CJ

రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ డైరెక్టర్. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ బీమ్లా నాయక్ విషయంలోనూ, మెగా ఫ్యామిలిలో అల్లు అర్జున్ మెగాస్టార్ తర్వాత అంతటి హీరో అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసి.. మళ్ళీ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ బాలీవుడ్ మీద దాడి చేస్తున్నాయంటూ సంచలనంగా మాట్లాడుతున్నారు. ఇక తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా వదిలిన NTR31 లుక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబోలో పాన్ ఇండియా మూవీ గా NTR31 తెరకెక్కనుంది. ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు NTR31 నుండి ఫస్ట్ లుక్ వదిలారు.

ఎన్టీఆర్‌ మాస్‌ జనాలు కోరుకునే పర్ఫెక్ట్ హీరో, ప్రశాంత్‌ నీల్‌.. మాస్‌ ఆడియన్స్ కావాలనుకునే పర్ఫెక్ట్ డైరక్టర్‌. అందుకే వీరిరువురు కలిసి  చేసే సినిమా వెండితెర మీద మాస్‌ సినిమాలకు సరికొత్త నిర్వచనంలా ఉంటుందని, చూడాలని ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో అంచనాలు మొదలయ్యాయి. NTR 31 గురించి ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం నా మనసులో పడ్డ ఆలోచనకు రూపమే ఈ సినిమా. ఈ సినిమా హద్దులూ, పరిధులూ అప్పుడే మనసులో నిర్ణయించుకున్నాను. ఎన్నాళ్లుగానో నా మనసులో పదిలపరచుకున్న నా డ్రీమ్‌ ప్రాజెక్ట్ ని, నా డ్రీమ్‌ హీరోతో చేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ అంచనాలు పెంచేశారు.

ఇక ఆ లుక్ చూసిన రామ్ గోపాల్ వర్మ తారక్ సినిమాల్లో ఇది నా మోస్ట్ అవైటెడ్ మూవీ అని కామెంట్ చేస్తూ NTR31 పోస్టర్ షేర్ చెయ్యగా అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Ram Gopal Varma on NTR31 first look:

RGV sensation on NTR31 first look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ