కమల్ హాసన్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్. ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు.
అడవి అన్నాక పులి సింహం చిరుత అన్నీ వేటకు వెళ్తాయి. జింక తప్పించుకోవాలని చూస్తుంది. ఆలోగ సూర్యాస్తమయం ఐతే సూర్యోదయాన్ని చూడబోయేది ఎవరనేది ప్రకృతి నిర్ణయిస్తుంది. కానీ ఈ అడవిలో వెలుగు ఎక్కడ ఎప్పుడు అని నిర్ణయించేది ప్రకృతి కాదు నేను' కమల్ హాసన్ పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
నా సరుకు నాకు దొరికితే మీ గవర్నమెంట్ తో పని లేదు. నా గవర్నమెంట్ ని నేను తయారు చేసుకోగలను'అనే డైలాగ్ తో విజయ్ సేతుపతి ఎంట్రీ ఇవ్వడం అదిరిపోయింది. ట్రైలర్ లో ఫహద్ ఫాసిల్ లుక్ కూడా నెక్స్ట్ లెవల్ వుంది. చిత్ర నిర్మాణ విలువలు, విజువల్స్ చాలా గ్రాండ్ వున్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ నిండిన 2నిమిషాల 38సెకన్ల నిడివి గల విక్రమ్ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలని పెంచేసింది.