Advertisementt

బిగ్ బాస్: అఖిల్ సార్థక్ పై ఫన్నీ మీమ్స్

Sat 21st May 2022 02:28 PM
bigg boss,bigg boss telugu ott,bigg boss non stop,akhil sarthak,abhijith,bindu madhavi  బిగ్ బాస్: అఖిల్ సార్థక్ పై ఫన్నీ మీమ్స్
Bigg Boss Telugu OTT: Funny memes on Akhil Sarthak బిగ్ బాస్: అఖిల్ సార్థక్ పై ఫన్నీ మీమ్స్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ లో ఎలాంటి ఫేమ్ లేకుండా సీజన్ 4 లోకి ఎంటర్ అయ్యి.. సోహెల్ ఫ్రెండ్ షిప్, మోనాల్ గజ్జర్ తో లవ్ ట్రాక్ తో బాగా ఎలివేట్ అయ్యి.. గొడవలతోను క్రేజ్ తెచ్చుకున్న అఖిల్ సార్థక్ గెలుస్తాడు, బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అవుతాడు అని చాలామంది ఎక్సపెక్ట్ చేసారు. కానీ అభిజిత్ టాస్క్ పెరఫార్మెన్స్ లో వీకయినా.. అతని వ్యక్తిత్వం, మాటకారి తనంతో బిగ్ బాస్ టైటిల్ ని ఎగరేసుకుపోయాడు. సో అఖిల్ సార్థక్ అక్కడ రన్నర్ గానే మిగిలాడు. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ లో టైటిల్ ఫెవరెట్ గా దిగిన అఖిల్ కి మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ బిందు మాధవి కొరకరాని కొయ్యగా మారింది. ఆమె టాస్క్ లో వీక్ అయినా, నామినేషన్స్ లో సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం, తనని విమర్శించిన వారికీ ఘాటైన రిప్లై ఇవ్వడంతో.. అఖిల్ కి చివరి వరకు పోటీ ఇచ్చింది.

బిగ్ బాస్ తెలుగు ఓటిటి సీజన్ 1 లో అఖిల్ టైటిల్ గెలుస్తాడని మొదట్లో అనుకున్న చివరికి వచ్చేసరికి లెక్కలు మారిపోయి.. బిందు మాధవి టైటిల్ ఎగరేసుకునిపోయినట్లుగా సోషల్ మీడియాలో లీకులు చెబుతున్నాయి. దానితో అఖిల్ ఫాన్స్ ఫుల్ గా డిశ్పాయింట్ అయినా.. చాలామంది మీమర్స్ మాత్రం అయ్యో విన్నర్ డిఫరెంట్ అయినా.. రన్నర్ మాత్రం అఖిలే అంటూ అభిజిత్, బిందు మాధవిలను విన్నర్ అంటూ అఖిల్ ని రన్నర్ గా చూపిస్తూ సోషల్ మీడియాలో ఫొటోస్ ని ట్రెండ్ చేస్తున్నారు. పాపం నిజమే ఫైనల్ లో టాప్ 1 కోసం ఫైట్ చేసి కేవలం టాప్ 2 రన్నర్ గా మిగలడం అఖిల్ బాడ్ లాక్ అనే చెప్పాలి.

Bigg Boss Telugu OTT: Funny memes on Akhil Sarthak:

Bigg Boss Telugu OTT trolls

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ