బిగ్ బాస్ లో ఇప్పటికి ఐదు సీజన్స్ పూర్తయ్యాయి.. ఆరో సీజన్ త్వరలోనే అంటే జులై, ఆగష్టు లో రాబోతుంది. అలాగే ఈ ఏడాది బిగ్ బాస్ ఓటిటి అంటూ ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా ఈ రోజుతో ముగిసింది. సీజన్ 1 నుండి 5 వరకు లేడీ కంటెస్టెంట్ ఎవరైన విన్ అవుతారని చాలామంది అనుకున్నా.. మొదటి సీజన్ లో శివ బాలాజీ విన్ అయ్యారు. హరితేజ టాప్5 వరకు వెళ్ళింది. సెకండ్ సీజన్ లో కౌశల్ - గీత మాధురి మధ్య ఫైనల్ వార్ పడినా అక్కడ కౌశల్ గెలిచాడు. ఇక సీజన్ 3 లో కూడా రాహుల్ విన్ అయ్యాడు. తర్వాత సీజన్ లో హారిక, అరియనా టాప్5 కి వెళ్లినా అభిజిత్ కప్ అందుకున్నాడు. ఇక సీజన్ 5 లోనూ సిరి టాప్ కి వెళ్లినా షణ్ముఖ్ - సన్నీ మధ్యన జరిగిన వార్ లో సన్నీ విన్ అయ్యాడు. కానీ ఒక్క లేడీ కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ విన్నర్ అవ్వలేదు. దీని మీద చాలా ట్రోల్స్ కూడా నడిచాయి.
బిగ్ బాస్ నాన్ స్టాప్ లో మొదట్లో అఖిల్ టైటిల్ ఫెవరెట్ గా కనిపించినా.. తర్వాత బిందు మాధవికి పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఆమె టైటిల్ ఫెవరెట్ గా మారింది. ప్రతి వారం అఖిల్, బిందు మాధవి ఇద్దరూ నామినేషన్స్ లోకి వెళ్లినా ఓటింగ్ లో పోటాపోటీగా సేవ్ అవుతూ వచ్చారు. ఫైనల్ గా టాప్ 7 కి వెల్లిన వారిలో అనిల్, బాబా భాస్కర్, మిత్ర శర్మ, అరియనా, శివ వరసగా ఎలిమినేట్ అవ్వగా.. టాప్ 2 కంటెస్టెంట్స్ గా అఖిల్ - బిందు మిగిలారు. నాగార్జున స్వయంగా హౌస్ లోకి వెళ్లి ఇద్దరినీ తీసుకువచ్చి.. ఫైనల్ గా బిందు మాధవిని విన్నర్ గా ప్రకటించారు. ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ విన్నర్ గా నిలవడం, తెలుగు బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి. ఇలా బిందు మాధవి నాన్ స్టాప్ విన్నర్ గా బిగ్ బాస్ ట్రోపి తీసుకువెళ్ళింది. అంతేకాదు లేట్ ఉమెన్స్ కి ఈ ట్రోఫీని డేడికేట్ చేసింది బిందు. ప్రైజ్ మనీ గా 40 లక్షల చెక్ అందుకుంది. పాపం అఖిల్ మళ్ళీ రన్నర్ గానే స్టేజ్ పై మిగిలాడు.