సర్కారు వారి పాట షూటింగ్ ముగించిన మహేష్ బాబు ప్రమోషన్స్ కి టైం ఉండడంతో ఫ్యామిలీ తో కలిసి ఫారిన్ ట్రిప్ వేసి వచ్చారు. నమ్రత, గౌతమ్, సితార తో కలిసి మహేష్ బాబు అక్కడ ఫారిన్ లో ఎంజాయ్ చేసిన ఫొటోస్, పిల్లలతో మహేష్ క్యూట్ మూమెంట్స్ అన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక సర్కారు వారి పాట ప్రమోషన్స్ కోసం తిరిగొచ్చిన మహేష్ బాబు ఆ సినిమా ప్రమోషన్స్ చకచకా ముగించెయ్యడమే కాదు, ఆ సినిమా హిట్ అవడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. సర్కారు వారి పాట సక్సెస్ సెలెబ్రేషన్స్ లో డాన్స్ చేస్తూ కొత్త మహేష్ ని చూపించిన మహేష్ బాబు.. తన నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో చెయ్యబోతున్నారు. త్రివిక్రమ్ తో చెయ్యబోయే SSMB28 షూటింగ్ కి ఇంకా కాస్త టైం ఉంది.
వచ్చే నెల అంటే జూన్ లో త్రివిక్రమ్ - మహేష్ కాంబో మూవీ రెగ్యులర్ షూట్ మొదలు కాబోతుంది. అందుకే ఈ గ్యాప్ లో మహేష్ బాబు మరోసారి వెకేషన్స్ కి చెక్కేశారు. మహేష్ బాబు భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార లతో కలిసి ఫ్యామిలీ ట్రిప్ వేశారు. ఆయన ఈరోజు ఉదయమే ఎయిర్ పోర్ట్ లో ఫ్యామిలీ తో కలిసి కనిపించారు. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీ ట్రిప్ ని ఎంజాయ్ చెయ్యడం కోసం విదేశాలకు వెళ్లారు.. మళ్ళీ కృష్ణ గారి బర్త్ డే టైం కి మహేష్ అండ్ ఫ్యామిలీ హైదరాబాద్ కి వచ్చేస్తుంది అని తెలుస్తుంది. మరి మే 31 కృష్ణ గారి పుట్టిన రోజుకి మహేష్ - త్రివిక్రమ్ కాంబో నుండి అప్ డేట్ ఉండబోతుంది అని మహేష్ ఫాన్స్ ఆశగా ఉన్నారు.