ఇప్పటివరకు బిగ్ బాస్ విన్నర్లు గా మారి ఫుల్ క్రేజ్ తో బయటకి వచ్చిన వారు కెరీర్ లో ఎలాంటి ఎదుగుదల కనిపించడం లేదు. ఎన్టీఆర్ సీజన్ అప్పుడు విన్నర్ అయిన శివ బాలాజీ అయితే అసలు లైం టైం లోనే లేరు. సినిమాలు, సీరియల్స్ ఇవేమి లేవు. ఇక సెకండ్ సీజన్ విన్నర్ కౌశల్ మండా అదిగో, ఇదిగో అనడమే కానీ ఆయన బిజీ అయిన దాఖలాలు లేవు. స్టార్ మా ప్రోగ్రాంలో కనిపిస్తున్నాడు అంతే. ఇక సీజన్ 3 రాహుల్ సిప్లిగంజ్ కెరీర్ లో ఆఫర్స్ ఏమో కానీ.. అప్పుడప్పుడు పోలీస్ కేసుల విషయంలో మీడియాలో హైలెట్ అవుతున్నాడు. ఇక సీజన్ 4 విన్నర్ అభిజిత్ రెండేళ్ళకి ఓ వెబ్ సీరీస్ లో కనిపిస్తున్నాడు. సీజన్ 4 విన్నర్ గా బయటికి వచ్చిన అభిజిత్ సినిమాలు చేసేస్తాడు అని అన్నా అది ఎక్కడా కనిపించలేదు. ఇక సీజన్ 5 విన్నర్ సన్నీ హీరోగా సినిమా మొదలయ్యింది ఆయనేం చేస్తాడో చూడాలి. మరి బిగ్ బాస్ విన్నర్స్ గా బయటికి వచ్చినా వారెవరూ బీబత్సంగా కెరీర్ లో సక్సెస్ అవ్వలేదు.
ఇప్పుడు ఓటిటి విన్నర్ బిందు మాధవి అయినా కెరీర్ లో ఏదైనా సాధిస్తుందేమో చూడాలి. అప్పుడే 40 కి దగ్గరలోకి వచ్చేసింది. ఏదైనా తనకి సక్సెస్ అనేది లేట్ గానే వస్తుంది అంటుంది. మరి హీరోయిన్ గా ఏ భాషలోనూ సక్సెస్ అవని బిందు మాధవి బిగ్ బాస్ క్రేజ్ తో ఏమైనా కెరీర్ లో బిజీ అయ్యి సక్సెస్ సాధిస్తుందేమో చూద్దాం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.