మహేష్ బాబు సర్కారు వారి పాట సూపర్ హిట్ జోష్ లో ఫాన్స్ ని తెగ పొగిడేశారు. కర్నూల్ ఈవెంట్ లో ఫాన్స్ ముందు స్టెప్స్ వేసి అదరగొట్టేసారు. ఫాన్స్ జోష్ ముందు తనేం చేస్తున్నానో కూడా అర్ధం కాలేదు అని, సర్కారు వారి పాటని అంత పెద్ద హిట్ చేసిన ఫాన్స్ కి చిన్న ట్రీట్ అంటూ చెప్పిన మహేష్ బాబు ఇప్పుడు ఆ హ్యాపినెస్ తో ఫ్యామిలీ తో కలిసి ఫారిన్ ట్రిప్ వేశారు. నమ్రత, సితార, గౌతమ్ లతో కలిసి మహెష్ బాబు నిన్న ఉదయమే వెకేషన్స్ కి బయలుదేరిన విషయం సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.
అయితే ఈసారి మహేష్ బాబు దుబాయ్ కో, స్విజ్జర్లాండ్ కో, అమెరికాకో వెళ్ళలేదు.. ఫ్యామిలీతో ట్రిప్ ఎంజాయ్ చెయ్యడానికి మహేష్ బాబు యూరప్ లో ల్యాండ్ అయ్యారు. మహేష్ అండ్ ఫ్యామిలీ రెండు వారాల పాటు యూరప్ లోనే ఎంజాయ్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. కొందరేమో మహేష్ బాబు యూరప్ ట్రిప్ పది రోజుల్లో ముగించేసుకుని కృష్ణ గారి బర్త్ డే టైం కి ఫ్యామిలీతో హైదరాబాద్ వస్తారని అంటున్నారు. ఇక మహేష్ యూరప్ ట్రిప్ ముగిసాక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో SSMB28 షూట్ లోకి అడుగుపెట్టనున్నారు.