మెగా ఫ్యామిలి లుకలుకలు గురించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ల కోసం మీడియా నే కాదు.. నెటిజెన్స్ కూడా ఆవురావురుమంటూ ఎదురు చూస్తూంటారు. మెగా ఫ్యామిలిలో హీరోలు ఎక్కువే. ఆ ఫ్యామిలిలో ఉండే సమస్యలు ఎక్కువే. పవన్ కళ్యాణ్ - చిరు మధ్యలో ఏదో గొడవ అంటారు. అల్లు అరవింద్ తో మెగా ఫ్యామిలీ దూరం దూరం అంటారు. మధ్యలో నాగబాబు న్యూస్ లో నలుగుతూనే వుంటారు.. ఇక అల్లు అర్జున్ ఐతే పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అంటాడు. పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీకి వ్యతిరేఖంగా రాజకీయ పార్టీ పెడతాడు. ఇలా ఒకటా రెండా చాలా సమస్యలు ఆ ఫ్యామిలిలో నడుస్తాయని టాక్ ఉంది.
అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ విషయంలో హైలెట్ అవుతున్న న్యూస్ ఏమిటి అంటే.. మెగా ఫ్యామిలి మెగాస్టార్ చిరు - అల్లు ఫ్యామిలీ సపరేట్ అయ్యారా? మెగా ఫాన్స్ తో మెగాస్టార్ ఇలాంటి సంకేతాలే ఇప్పిస్తున్నారా? అందుకే మెగా మీటింగ్ లో అల్లు అర్జున్ ఫోటో పెట్టకుండా చిరు, పవన్, రామ్ చరణ్ ఫొటోస్ పెట్టి అల్లు ని అవాయిడ్ చేసారా?. చెప్పను బ్రదర్, అన్న ఆయనతో మనకేమిటి..? చిరంజీవి గారు నన్ను తిట్టినా నేను మాత్రం అల్లు అర్జున్ ని సపోర్ట్ చెయ్యను అని ఓ ఫ్యాన్ బహిరంగంగానే మాట్లాడడం.. ఇవన్నీ దేనికి సంకేతాలో అర్ధం కావడం లేదు. అటు మెగాస్టార్ తమ హీరోలని హైలెట్ చెయ్యడానికి ఓ మీడియా వర్గాన్ని మచ్చిక చేసుకుంటున్నారని, దాని కోసం మెగా పీఆర్వో లు గట్టిగా పని చేస్తున్నారని అంటుంటే.. అటు అల్లు ఫ్యామిలీ కూడా తమ పవర్ చూపించడానికి తన మీడియా వర్గాన్ని హైలెట్ చేస్తుంది అని, అందుకే అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా పీఆర్వోలే మేనేజ్ చేస్తున్నారంటూ.. ఏవేవో కథనాలు వండి వారుస్తున్నారు.
అయితే రీసెంట్ గా జరిగిన మెగా మీటింగ్ మాత్రం మెగా - అల్లు ఫ్యామిలీకి మధ్యన పొగ బెట్టింది అనడంలో సందేహం లేదు.