Advertisementt

బిందు మాధవి పెళ్లిపై ఆమె తండ్రి కామెంట్స్

Tue 24th May 2022 07:56 PM
bindu madhavi,bindu madhavi wedding,big boss winner,bindu madhavi father  బిందు మాధవి పెళ్లిపై ఆమె తండ్రి కామెంట్స్
Bindu Madhavi Big Boss Winner బిందు మాధవి పెళ్లిపై ఆమె తండ్రి కామెంట్స్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ విన్నర్ గా చరిత్ర సృష్టించిన బిందు మాధవి కి అన్ని చాలా లెట్ గా అందుతాయని ఆమె బిగ్ బాస్ హౌస్ లో చాలాసార్లు చెప్పింది. అలాగే తన తండ్రి మాట వినేదాన్ని కాదని, ఈవెన్ ఆయన పెళ్లి చేసుకోమన్న చేసుకోకుండా అలానే ఉన్నాను అంటూ బిందు కాస్త ఎమోషనల్ కూడా అయ్యింది. అయితే లేట్ వయసులో బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్న బిందు మాధవి తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు కూడా చేసింది. కానీ హీరోయిన్ గా ఆమెకి పెద్దగా సక్సెస్ అయితే దక్కలేదు.

ఇక బిగ్ బాస్ విన్నర్ గా బయటికి వచ్చిన బిందు మాధవి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆమె పెళ్లిపై బిందు మాధవి తండ్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ప్రస్తుతం బిందు మాధవి పెళ్లి గురించి తాము ఆలోచించడం లేదని, ఆమెకు పెళ్లంటే ఇష్టం ఉన్నప్పుడే చేస్తామని చెప్పుకొచ్చాడు. బిందు మాధవి ఇంజనీరింగ్‌ చదివేటప్పుడే పెళ్లి గురించి ఓ తండ్రిగా ఆమెని చాలా ఒత్తిడి చేశా. అప్పుడు చాలా మంచి సంబంధాలు వచ్చాయి. ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌, డాక్టర్‌, అమెరికా ఇంజనీరింగ్‌ సంబంధాలు వచ్చాయి. కానీ బిందు ఒప్పుకోలేదు. నేను ఎంతగా ఒత్తిడి చేసినా ఒప్పుకోలేదు. నేను చాలా ఫీలయ్యాను.

నేను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడే నా పెళ్లి చెయ్యండి, నేను చిన్న పిల్లని కాదు కదా, నా మంచి చెడులు గురించి నాకు తెలుసు, నేను ఎప్పుడు అడిగితే అప్పుడు నా పెళ్లి చెయ్యమని చెప్పింది.  అప్పటినుండి నేను తనపై ఒత్తిడి తీసుకురాలేదు. తన ఇష్టానికి తనని వదిలేసాను అంటూ చెప్పుకొచ్చారు.

Bindu Madhavi Big Boss Winner :

Big Boss Winner Bindu Madhavi wedding Her father comments

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ