Advertisementt

ఎన్టీఆర్ తర్వాత ప్రశాంత్ నీల్ నెక్స్ట్.?

Tue 24th May 2022 08:40 PM
prashant neil,nani,pan india movie,ntr,ntr30  ఎన్టీఆర్ తర్వాత ప్రశాంత్ నీల్ నెక్స్ట్.?
Prashant Neil next after NTR.? ఎన్టీఆర్ తర్వాత ప్రశాంత్ నీల్ నెక్స్ట్.?
Advertisement
Ads by CJ

కెజిఎఫ్ చాప్టర్ తో తర్వాత ప్రశాంత్ నీల్ ఆ సక్సెస్ జోష్ తో ప్రభాస్ తో సలార్ షూట్ రెస్యూమ్ కి వెళ్లిపోయారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ సెట్ లో సలార్ షూట్ చిత్రీకరణ జరిగింది. ప్రభాస్ ని ఊర మాస్ గా సలార్ లో చూపించబోతున్నారు ప్రశాంత్ నీల్. అదే ఫార్ములాలతో ప్రశాంత్ నీల్ తన తదుపరి మూవీ ఎన్టీఆర్ తోనూ చేస్తున్నారు. ఈమధ్యనే NTR31 లో ఎన్టీఆర్ లుక్ రివీల్ చేసిన ఎన్టీఆర్ ఫాన్స్ కి కిక్ ఇచ్చారు. కాకపోతే ప్రశాంత్ నీల్ మాత్రం రొటీన్ ఫర్ములా మాస్ యాక్షన్ తోనే మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తున్నారని అనుకుంటున్నారు.

అయితే ఎన్టీఆర్ తర్వాత ప్రశాంత్ నీల్.. అల్లు అర్జున్ లేదంటే రామ్ చరణ్ మూవీ చేస్తారనుకుంటే.. ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తర్వాత నేచురల్ స్టార్ నాని తో సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. నాని తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడని ఆ వార్త సారాంశం. అయితే ఈ వార్తలో నిజమెంతుందో తెలియదు కాని.. ఈ న్యూస్ మాత్రం బాగా వైరల్ అవుతుంది. ఇంకా నాని మహేష్ కి విలన్ గా త్రివిక్రమ్ మూవీలో చేయబోతున్నాడని కూడా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అయితే నాని అంటే సుందరానికి ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. 

Prashant Neil next after NTR.?:

Prashant Neil Pan India Movie with Nani.?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ