యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కబోతున్న NTR30 జూన్ రెండు నుండి పూజ కార్యక్రమాలతో పట్టాలెక్కబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాకి సంబందించిన మ్యూజిక్ డైరెక్టర్, అలాగే కెమెరా మ్యాన్, ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్ ఇలా అందరూ సెట్ అయ్యిపోయారు. కాకపోతే హీరోయిన్ విషయమే క్లారిటీ రావడం లేదు. అంటే అలియా భట్ ని NTR30 కి హీరోయిన్ గా ఫిక్స్ చేసి అధికారిక ప్రకటన ఇచ్చినప్పటికీ.. అలియా భట్ NTR30 ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది అనే ప్రచారం జరుగుతుంది. అలాగే రీసెంట్ గా దీపికా పదుకొనే కూడా ఎన్టీఆర్ తో నటించడానికి రిజెక్ట్ చేసింది అనే న్యూస్ నడిచింది. ఇక NTR30 మూవీ ఓపెనింగ్ అయ్యేలోపు హీరోయిన్ ని ఫైనల్ చెయ్యలాని కొరటాల చూస్తున్నారట.
అయితే తాజాగా NTR30 కి హీరోయిన్ సాయి పల్లవిని అప్రోచ్ అవుతున్నారని, ఆమె నటిస్తే తెలుగు, తమిళ్, మలయాళంలో మంచి క్రేజ్ ఉంటుంది అని కొరటాల భావిస్తున్నారు అని, సాయి పల్లవి మంచి నటి, సూపర్ డాన్సర్ సో సినిమాకి అవి బాగా హెల్ప్ అవుతాయని ఎన్టీఆర్ ని కూడా ఒప్పించినట్లుగా సోషల్ మీడియాలో ఆ గాసిప్ బాగా చక్కర్లు కొడుతోంది. అయితే సాయి పల్లవి నేచురల్ బ్యూటీ, సూపర్ పెరఫార్మెర్. కానీ ఆమె స్థాయి పాన్ ఇండియాకి సరిపోతుందా అనేది ఎన్టీఆర్ ఫాన్స్ లో ఉన్న అనుమానం. అలాగే ఎన్టీఆర్ పక్కన బోల్డ్ గా గ్లామర్ గా కనిపించగలదా అనే అనుమానాలు రేజ్ అయ్యాయి. చూద్దాం ఫైనల్ గా ఎన్టీఆర్ కి ఏ హీరోయిన్ సెట్ అవుతుందో అనేది.