మహానటి తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాటతో సక్సెస్ ఇచ్చారు కీర్తి సురేష్ కి. మహానటి బ్లాక్ బస్టర్ తర్వాత కీర్తి సురేష్ లక్కు, ఆమె అందంరో పాటుగా సక్సెస్ అన్ని దూరమైపోయాయి. పెరిగిన బరువు, వరస ప్లాప్స్ తో కీర్తి సురేష్ కాస్త డీలా పడింది. పెరిగిన బరువు తగ్గేందుకు వర్కౌట్స్, యోగ, సూర్య నమస్కారాలు మొదలు పెట్టింది. అదే ఊపులో బాగా బరువు తగ్గి స్లిమ్ గా తయారై సర్కారు వారి పాట లో ఆఫర్ పట్టేసింది. కానీ కీర్తి సురేష్ సన్నబడడం వలన ఆమె మొహంలో గ్లో మిస్ అయ్యింది. ఆమె మొహంలో అందం కానీ, కళ కానీ లేకుండా పోయింది. దానితో మహేష్ బాబు ఫాన్స్ చాలా దిగులుపడిపోయారు.
అయితే సర్కారు వారి పాటలో కళావతిగా కీర్తి సురేష్ పర్వాలేదనిపించింది. సర్కారు వారి పాట ఫస్ట్ హాఫ్ లో మహేష్ తో కామెడీ వర్కౌట్ చెయ్యడం, సాంగ్స్ లో గ్లామర్ గా డాన్స్ చెయ్యడం వంటి విషయాలతో ఆకట్టుకుంది. అంతేకాకుండా ప్రమోషన్స్ లోను గ్లామర్ గాను కళగాను కనిపించింది. తాజాగా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే కళావతి ఫేస్ లో కళ కొట్టొచ్చింది అనేలా కాస్త బబ్లీ ఫేస్ తో నవ్వుతూ అందంగా కనిపించింది. సారీ లుక్ లో కీర్తి సురేష్ మొహంలో గ్లో, ఆ స్మైల్ అన్ని సూపర్ అనేలా ఉన్నాయి. ఇక కీర్తి భోళా శంకర్ లో చిరు కి సిస్టర్ గా నటిస్తుంది.