Advertisementt

ఏజెంట్ షూటింగ్ అప్ డేట్

Wed 25th May 2022 11:14 AM
akhil akkineni,surender reddy,anil sunkara,agent movie,agent shooting in manali  ఏజెంట్ షూటింగ్ అప్ డేట్
Agent Shooting In Manali ఏజెంట్ షూటింగ్ అప్ డేట్
Advertisement
Ads by CJ

యంగ్ హీరో అఖిల్ అక్కినేని మరియు సురేందర్ రెడ్డి కలయికలో అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఏజెంట్ మూవీ అప్ డేట్ వచ్చేసింది. సోషల్ మీడియాలో ఏజెంట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి - హీరో అఖిల్ కి మధ్యన విభేదాలు రావడంతో షూటింగ్ కి బ్రేక్ వచ్చింది అనే ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ అనిల్ సుంకర మనాలిలో ఏజెంట్ మూవీ కొత్త షెడ్యూల్ మొదలు కాబోతుంది అని అప్ డేట్ ఇచ్చారు. మధ్యలో అఖిల్ మాల్దీవుల్లో రెండు వారాల పాటు ఎంజాయ్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆగస్టు లో ఏజెంట్ మూవీ విడుదలకు సిద్దమవుతుంది.

దానితో షూటింగ్ శరవేగంగా జరపాలని చూస్తుంది టీం. ప్రస్తుతం ఏజెంట్ టీమ్ మనాలిలో కొన్ని హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది, వాటిని యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ పర్యవేక్షిస్తున్నారు. అఖిల్‌తో పాటు ఇతర ప్రముఖ నటీనటులు మనాలి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవ‌ర్ అయ్యారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. టీం ఒక పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఏజెంట్ అప్ డేట్ ఇచ్చింది. ఆ పిక్ లో అఖిల్‌తో పాటు సురేందర్ రెడ్డి, రసూల్ ఎల్లోర్ మరియు విజయ్ మాస్టర్‌లను మనం చూడవచ్చు.

Agent Shooting In Manali:

Akhil Akkineni, Surender Reddy, Anil Sunkara Crazy Project Agent Shooting In Manali

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ