Advertisementt

రామ్ చరణ్ జోక్యం.. మెగా గొడవ ఏమైంది

Wed 25th May 2022 09:37 PM
ram charan,mega vs allu,mega fans,allu arjun fans,allu fans vs mega fans  రామ్ చరణ్ జోక్యం.. మెగా గొడవ ఏమైంది
Mega fans vs Allu fans రామ్ చరణ్ జోక్యం.. మెగా గొడవ ఏమైంది
Advertisement
Ads by CJ

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ vs అల్లు ఫ్యామిలీ అన్న రేంజ్ లో అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తూ ఆయన ఫాన్స్ హంగామా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని చెప్పను బ్రదర్ అంటూ అవమానించిన వాడిని మేము ఇంకా ఇంకా మొయ్యలేం అంటూ మెగా అభిమానులు అందరూ పవన్ కళ్యాణ్ వెంట నడవాలని మెగా అభిమాన సంఘ అధ్యక్షుడు ఆదివారం జరిగిన మెగా మీటింగ్ లో పిలుపునివ్వడంతో మెగా ఫాన్స్ రెండుగా చీలిపోయి అల్లు vs మెగా గా మారిపోయింది. దానితో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని #EmPeekaleruBrother అనే హాష్ టాగ్స్ ట్రెండ్ చేస్తూ సపోర్ట్ చెయ్యడంతో.. అటు చిరు కానీ, ఇటు అరవింద్ కానీ జోక్యం చేసుకుని ఈ గొడవ ఆపుతారేమో అని అందరూ చూస్తున్నారు. 

అయితే రీసెంట్ గా ఈ గొడవ విషయం రామ్ చరణ్ దగ్గరకి వెళ్లగా.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారని, దానితో అల్లు అర్జున్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భవాని రవికుమార్ అల్లు అర్జున్ అభిమానులకు క్షమాపణ చెబుతూ ఒక వీడియో విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. తాను చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ ని సంబోధిస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదని అనిపిస్తోందని ఈ విషయం మీద రామ్ చరణ్ గారు కూడా తన మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది అని, అందుకే అల్లు అర్జున్ అభిమానులు అలాగే రామ్ చరణ్ అభిమానులు తనను క్షమించాలని ఆ వీడియో రిలీజ్ చేసాడు. మరి ఈ వీడియో వచ్చాక కూడా అల్లు ఫాన్స్ లో ఆగ్రహం చల్లారినట్టుగా లేదు. సోషల్ మీడియాలో #EmPeekaleruBrother హాష్ టాగ్ ని ఇంకా ట్రెండ్ చేస్తూనే ఉన్నారు.

Mega fans vs Allu fans:

Ram Charan intervention, Mega vs Allu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ