నాగ చైతన్య పెళ్లి కి ముందు పెళ్లి తర్వాత కూడా పెద్దగా మీడియాకి ఫోకస్ అవ్వలేదు. సమంత ని పెళ్లి చేసుకున్నాక ఆమెతో దిగిన కొన్ని ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత కన్నా విడాకుల తర్వాత నాగ చైతన్య హైలెట్ అయినా ఆయన మాత్రం చాలా కామ్ గానే మీడియా ని అవాయిడ్ చేసారు. అయితే తాజాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య చేస్తున్న లవ్ స్టోరీ థాంక్యూ. ఈ సినిమాలో నాగ చైతన్య ముగ్గురు అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన థాంక్యూ టీజర్ చూస్తే ఇది నాగ చైతన్య పర్సనల్ లైఫ్ చూసి డిజైన్ చేసారా అని అనిపించక మానదు.
వ్యాపారవేత్త అభిరామ్ కేరెక్టర్ లో నాగ చైతన్య కనిపించిన థాంక్యూ లో నువ్వు సెల్ఫ్ సెంట్రిక్ అయ్యావు, నీ లైఫ్‌లో నీకు తప్ప మరో వ్యక్తికి చోటు లేదు అంటూ రాశి ఖన్నా బ్యాగ్రౌండ్ లో చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. అన్నీ వదులుకుని ఇక్కడిదాకా వచ్చాను.. ఇక లైఫ్‌లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు, నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే.. లాంటి డైలాగ్స్ చూస్తుంటే నాగ చైతన్య విడాకుల తర్వాత ఫీలయిన మాటలను ఇలా థాంక్యూ టీజర్ లో చూపించారేమో, అలాగే తన మాజీ భార్య సమంతని టార్గెట్ చేస్తూ ఈ డైలాగ్స్ చెప్పారేమో అనే ఫీలింగ్ ప్రతి ఒక్క ఆడియెన్ లోను కలుగుతుంది. మరి టీజర్ చూసాక అనిపించిన ఫీలింగ్ సినిమా చూసాక కూడా అనిపిస్తుందో.. లేదో.. చూడాలి.