అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్-వరుణ్ తేజ్ కలిసి నటించిన F3 మూవీ నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. F2 కి సీక్వెల్ గా నవ్వుల ఫ్రాంచైసీ అంటూ భారీ ప్రమోషన్స్ చేసి F3 తో బరిలోకి దిగిన టీం కి.. ఈ రోజు ఉదయం నుండి గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. F3 కి ఓవర్సీస్ నుండి అద్భుతమైన టాక్ స్ప్రెడ్ అయ్యింది. సినిమా హిట్ అంటూ కామెడీని ఎంజాయ్ చేస్తున్నాం అంటూ ఆడియన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. సినిమాకి మెయిన్ హైలెట్ వెంకటేష్ అని, వెంకటేష్ కామెడీ టైమింగ్, వెంకటేష్ పెరఫార్మెన్స్ అన్ని సినిమాకి ప్లస్ అని చెబుతున్నారు.
ఉదయం నుండి F3 పై సోషల్ మీడియాలో సందడి మొదలయ్యింది.అందరూ యునానమస్ గా చెబుతున్నది ఒక్కటే. అది వెంకీ మామ్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది అని. వెంకీ వన్ మ్యాన్ షో అని. F3 లో స్టార్ హీరోల రిఫరెన్సెస్ ఉన్నాయని నిర్మాత దిల్ రాజు చాలా ఇంటర్వూస్ లో చెప్పారు. పవన్ కళ్యాణ్ మొదలుకుని రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ అందరి హీరోల రిఫరెన్సెస్ ని సినిమాలో ఇంక్లూడ్ చేయినప్పటికీ.. వాళ్ళ మేనేరిజం ని ఇమిటేట్ చేస్తూ వరుణ్ చేసిన కామెడీ థియేటర్స్ లో విజిల్స్ వేయిస్తుంది అంటున్నారు.
వెంకటేష్ పెద్ద స్టార్ హీరో, సీనియర్ అయినప్పటికీ ఎలాంటి ఈగోలకి పోకుండా, ఎటువంటి అహంభావాన్ని ప్రదర్శించకుండా కుర్ర హీరోలని అనుకరిస్తూ ఆయన చేసిన పెరఫార్మెన్స్ ఆడియన్స్ చేత థియేటర్స్ క్లాప్స్ కొట్టిస్తుంది అంటూ వెంకీ F3 కామెడీపై ఆడియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టేస్తున్నారు.