నాగ చైతన్య లేటెస్ట్ మూవీ థాంక్యూ నుండి తాజాగా టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. నాగ చైతన్య బిజినెస్ మ్యాన్ గా ముగ్గురు హీరోయిన్స్ రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ తో రొమాన్స్ చేస్తున్నాడు. అయితే థాంక్యూ మూవీ టీజర్ లో నాగ చైతన్య చెప్పిన కొన్ని డైలాగ్స్ ఆయన మాజీ భార్య సమంత ని ఉద్దేశించి చేసినవే అంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్న టైం లో నాగ చైతన్య బావ, మరో హీరో రానా థాంక్యూ టీజర్ నాగ చైతన్య చెప్పిన ఓ డైలాగ్ పై కామెంట్ చెయ్యడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
నన్ను నేను సరిచేసుకోవాడినికే చేస్తున్న ప్రయాణమే థ్యాంక్ యూ అంటూ నాగ చైతన్యు టీజర్ లో చెప్పిన డైలాగ్ కి రిప్లై ఇస్తూ నువ్వు ఇప్పటికే సరి అయిపోయావు బ్రదర్, సూపర్ టీజర్ గాయ్స్ అంటూ రానా కామెంట్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. అంటే సమంత కి డివోర్స్ ఇచ్చి చైతూ సరయ్యాడనా రానా ఫీలింగ్, లేదంటే డివోర్స్ ఇచ్చాక తనని తాను చైతు సరి చేసుకున్నాడని రానా అలా కామెంట్ చేసింది అనేది ఇప్పుడు నెటిజెన్స్ మధ్యన జరుగుతున్న చర్చ.