Advertisementt

ఎన్టీఆర్ జయంతి: బాలయ్య పవర్ఫుల్ లుక్

Sat 28th May 2022 10:36 AM
nbk107,balakrishna,gopichand malineni,sruthi hasan,sr ntr,ntr jayanthi  ఎన్టీఆర్ జయంతి: బాలయ్య పవర్ఫుల్ లుక్
NBK 107: Balakrishna creates a mass sensation ఎన్టీఆర్ జయంతి: బాలయ్య పవర్ఫుల్ లుక్
Advertisement
Ads by CJ

ఈరోజు మే 28 సీనియర్ ఎన్టీఆర్ 100వ జయంతి. ఎన్టీఆర్ జయంతి రోజున నందమూరి ఫ్యామిలీ అంతా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పుష్పగుచ్ఛాలు ఉంచి ఆ మహనీయుడిని స్మరించుకుంటే.. ఆ ఫ్యామిలీ హీరోలు నటిస్తున్న సినిమా ల నుండి లుక్స్ కానీ, లేదంటే మరేదన్నా అప్ డేట్స్ కానీ ఇస్తుంటారు. ఇక తెలుగువాడి గుండెల్లో కొలువై ఉన్న ఆ మహనీయుడి జయంతికి టిడిపి పార్టీ మహానాడు కార్యక్రమంతో స్మరించుకుంటుంది. ఇక ఈ రోజు ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా బాలకృష్ణ నటిస్తున్న సినిమా నుండి అప్ డేట్ రాబోతుంది అంటూ నిన్నటి నుండే ఆ అప్ డేట్ పై అంచనాలు పెరిగేలా చేసింది టీం.

బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కలయికలో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న NBK107 మూవీ నుండి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పవర్ ఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఇంతకుముందు NBK107 ఫస్ట్ లుక్ లో బ్లాక్ షర్ట్, లుంగీతో మాస్ అవతార్ లో ప్యాబ్యులెస్ గా కనబడిన బాలకృష్ణ ఈ పోస్టర్ లో క్రూరమైన అవతారంలో కనిపిస్తున్నారు. వైట్ అండ్ వైట్ దుస్తులు ధరించి, బాలకృష్ణ చేతిలో ప్రత్యేకంగా రూపొందించిన కత్తిని పట్టుకున్నాడు. చిన్నపాటి గడ్డం మరియు మీసాలతో బాలకృష్ణ యంగ్ మరియు డాషింగ్‌ లుక్ లో కనిపిస్తున్నారు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న NBK107 లో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తుండగా, కన్నడ దునియా విజయ్ విలన్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

NBK 107: Balakrishna creates a mass sensation:

NBK107: Balakrishna wields sword ferociously

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ