Advertisementt

మెగాస్టార్ అమెరికా టు మలేసియా

Sat 28th May 2022 10:49 AM
megastar chiranjeevi,malaysia trip,bobby movie,chiru 154,waltair veerayya  మెగాస్టార్ అమెరికా టు మలేసియా
Chiranjeevi Next Movie Shooting In Malaysia మెగాస్టార్ అమెరికా టు మలేసియా
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విడుదల కాగానే.. భార్య సురేఖ తో అమెరికాకి లాంగ్ ట్రిప్ వేశారు. ఇంకా చిరు తిరిగి హైదరాబాద్ కి వచ్చిన న్యూస్ లేదు. దాదాపు నెల రోజుల పాటు చిరంజీవి అమెరికా టూర్ లో ఉంటారని అన్నారు. అయితే అమెరికా నుండి రాగానే మెగాస్టార్ గాడ్ ఫాదర్, భోళా శంకర్ షూటింగ్ లో జాయిన్ అవ్వకుండా దర్శకుడు బాబీ తో చేస్తున్న వాల్తేర్ వీరయ్య షూటింగ్ లో జాయిన్ అవుతారట. Chiru154 టైటిల్ గా ఇంకా అధికారికంగా వాల్తేర్ వీరయ్యని ప్రకటించకపోయినా చిరు, బాబీ లు వేరు వేరు సందర్భాల్లో ఆ టైటిల్ ని రివీల్ చేసేసారు.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు హైదరాబాద్ లోనే జరిగినా తదుపరి షెడ్యూల్ మాత్రం మలేసియా లో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. చిరు అమెరికా నుండి రాగానే చిన్నపాటి బ్రేక్ తో మళ్లీ వాల్తేర్ వీరయ్య కోసం మలేసియా కి ప్రయాణం పెట్టుకోబోతున్నారట. సుమారు 20 రోజులు మలేసియా లోనే షూట్‌ ప్లాన్‌ చేశారని తెలుస్తుంది. ఈ సినిమాకు మలేసియా ఎపిసోడ్ కీలకమని సమాచారం. 

Chiranjeevi Next Movie Shooting In Malaysia:

 Megastar Chiranjeevi Malaysia Trip.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ