Advertisementt

అనుపమ ఎవరిని ప్రేమిస్తుందబ్బా..

Mon 30th May 2022 01:36 PM
anupama parameswaran,anupama love story,anupama parameswaran photos,anupama parameswaran news  అనుపమ ఎవరిని ప్రేమిస్తుందబ్బా..
Anupama Parameswaran: I am in love .. but! అనుపమ ఎవరిని ప్రేమిస్తుందబ్బా..
Advertisement
Ads by CJ

టాలీవుడ్ క్యూట్ అండ్ స్వీట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గతంలో క్రికెటర్ బూమ్రాతో లవ్ ఎఫ్ఫైర్ నడిపింది అనే ప్రచారం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో జరిగింది. కానీ తర్వాత బుమ్రా సంజనని పెళ్లి చేసుకోవడంతో అవన్నీ రూమర్స్ అని తేలిపోయాయి. ఇక సౌత్ సినిమాలు చేసుకుంటున్న అనుపమ రౌడీ బాయ్స్ తో ఈ ఏడాది ఆడియన్స్ ని పలకరించింది. ఇప్పుడు నిఖిల్ తో 18 పేజెస్ తో పాటుగా బటర్‌ ఫ్లై సినిమాల్లో నటిస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఈ మధ్యన ఆక్టివ్ గా మారిన అనుపమ అటు గ్లామర్ రోల్స్ కి కూడా సై అంటుంది.

తాజాగా అనుపమ ప్రేమ పాటలు చెబుతుంది. తాను రిలేషన్ షిప్ లో ఉన్నట్లుగా చెప్పకనే చెబుతుంది. తనకి ప్రేమ వివాహం పై మంచి అభిప్రాయం ఉంది అని, ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటని చూస్తే తనకి చాలా ముచ్చటగా అనిపిస్తుంది అని, తాను కూడా ప్రేమ వివాహమే చేసుకుకోవాలనుకుంటున్నా అని, దానికి తన పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది అని, తాను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటా అని చెబుతుంది. నేను సింగిల్‌.. కాదు మింగిల్‌.. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు.. ఎందుకంటే నా రిలేషన్‌షిప్ స్టేటస్ నాకు కూడా సరిగ్గా తెలియట్లేదు అంటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది అనుపమ. 

నేనైతే ప్రేమలో ఉన్నా, కానీ నేను ప్రేమించే వ్యక్తి మాత్రం ఏమనుకుంటున్నారో తెలియదు. ప్రస్తుతం వన్‌ సైడ్‌ లవ్‌ అని చెప్పగలను అంటూ అందరికి ఓ ఫజిల్ పెట్టింది. అనుపమ చెప్పింది విన్న నెటిజెన్స్ అనుపమ ఎవరిని ప్రేమిస్తుందబ్బా అంటూ మెదడుకి పని పెడుతున్నారు.

Anupama Parameswaran: I am in love .. but!:

Anupama Parameswaran on Love Marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ