అమీర్ ఖాన్ - కరీనా కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చద్దా. ఈ సినిమా ఆగష్టు లో రిలీజ్ కి రెడీ అవుతుంది. తాజాగా లాల్ సింగ్ చద్దా ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. లాల్ సింగ్ చద్దా హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కి రీమేక్. అయితే లాల్ సింగ్ చద్దా లో ఎలాంటి కాంట్రవర్సీ లేకపోయినా.. అమీర్ ఖాన్ గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు లాల్ సింగ్ చద్దా ప్రోబ్లెంస్ లో ఇరుక్కుంది. సోషల్ మీడియాలో నెటిజెన్స్ #BoycottLaalSinghChaddha #BoycottBollywood హాష్ టాగ్స్ ని ట్రెండ్ చేస్తూ అమీర్ ఖాన్ కి చుక్కలు చూపిస్తున్నారు. అమీర్ ఖాన్, కరీనా కపూర్, అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు లని కూడా నెటిజెన్స్ వదల్లేదు.
కారణం అమీర్ ఖాన్ గతంలో సత్యమేవ జయతే టాక్ షో లో శివునికి అభిషేక్ చేయడంపై అమీర్ చేసిన సంచలన వ్యాఖ్యలకు బదులుగా ఇప్పుడు నెటిజెన్స్ రివెంజ్ తీర్చుకుంటున్నారు. శివ లింగానికి 20 రూపాయలు పెట్టి పాలు కొని అభిషేకం చెయ్యడం దండగ, ఆ పాలతో పేద పిల్లలని బ్రతికించు అంటూ కామెంట్స్ చెయ్యడం, అలాగే కరీనా కపూర్ మా సినిమాలని ఇష్టం లేకపోతె బలవంతంగా చూడొద్దు అని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా లాలా సింగ్ చద్దా సినిమాను బహిష్కరించండి, ఆ సినిమా టికెట్ డబ్బుతో పేద పిల్లల ఆహారం కోసం ఖర్చు చేయండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఎన్నో సినిమాలని కాపీ చేసి సినిమాలు చేసిన అమీర్ ఖాన్ మిస్టర్ ఫర్‌ఫెక్టా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం నిన్నటినుండి సోషల్ మీడియాలో #BoycottLaalSinghChaddha హాష్ టాగ్ హైలెట్ అవుతూనే ఉంది.