Advertisementt

సర్కారు వారి పాటకు బ్రేక్ ఈవెన్ కష్టాలు?

Tue 31st May 2022 08:58 PM
sarkaru vaari paata,sarkaru vaari paata collections,svp collections,mahesh babu,svp makers  సర్కారు వారి పాటకు బ్రేక్ ఈవెన్ కష్టాలు?
Sarkaru Vaari Paata collections update సర్కారు వారి పాటకు బ్రేక్ ఈవెన్ కష్టాలు?
Advertisement
Ads by CJ

సర్కారు వారి పాట విడుదలై మూడు వారాలు పూర్తి కావొస్తుంది. సర్కారు వారి పాట విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్ పడినా, క్రిటిక్స్ మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చినా, టీం చేసిన ప్రమోషన్స్, మహేష్ సినిమాని ప్రమోట్ చెయ్యడం లాంటి విషయాలతో మొదటి వారం మంచి కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన ప్రతి ఏరియా లో మొదటి వారం గట్టిగా కొట్టింది అనే చెప్పాలి. తర్వాత రెండో వారంలో కూడా సినిమాలేవీ లేకపోవడంతో సర్కార్ వారి పాటకి కలిసొచ్చింది. రెండో వారము కలెక్షన్స్ పర్వాలేదనిపించింది. మూడో వారానికి F3 సర్కారు వారి పాట కలెక్షన్స్ దెబ్బేసింది.

అయితే మూడు వారాలైనా కొన్ని ఏరియాల్లో సర్కారు వారి పాట బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అని, అఫీషియల్ పోస్టర్స్ అంటూ మేకర్స్ వదిలిన పోస్టర్స్ లో ఒక్కటీ నిజం లేదని, మేకర్స్ సర్కారు వారి పాట కలెక్షన్స్ విషయంలో మీడియా ని పక్కదోవ పట్టించారంటూ ఏవేవో న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కేవలం ఓవర్సీస్ లోనే సర్కారు వారి పాట బ్రేక్ ఈవెన్ సాధించింది అని, మిగతా అన్ని ఏరియాల్లో బయ్యర్లు కొద్దిపాటి నష్టాలూ చవి చూడాల్సి వచ్చేలా ఉంది అంటున్నారు. 19 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 108.78 కోట్లు షేర్ వచ్చిన సర్కారు వారి పాట కి 120 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేయడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 121 కోట్లుగా ఫిక్స్ అయ్యింది. కానీ ఇప్పుడు సర్కారు వారి కలెక్షన్స్ 110 కోట్లు దగ్గరే ఆగిపోయేలా ఉంది అంటున్నారు. సో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి సర్కారు వారి పాట కష్టాలు పడుతుంది అంటూ అంచనా వేస్తున్నారు.

Sarkaru Vaari Paata collections update:

Sarkaru Vaari Paata 19 days collections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ