Advertisementt

శ్రీదేవిని కూడా వదిలేసిన సుడిగాలి సుధీర్

Wed 01st Jun 2022 04:43 PM
sudigaali sudheer,sudheer,jabardasth,sridevi drama company  శ్రీదేవిని కూడా వదిలేసిన సుడిగాలి సుధీర్
Sudheer quits Sridevi Drama company? శ్రీదేవిని కూడా వదిలేసిన సుడిగాలి సుధీర్
Advertisement
Ads by CJ

జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ ఓ వారం రాకపోయేసరికి ఆయన ఫాన్స్ చాలా కంగారు పడిపోయారు. ఎందుకంటే ఢీ డాన్స్ షో నుండి సుధీర్ సడన్ గా తప్పుకోవడం ఆయన అభిమానులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. సుధీర్ అన్నా ఢీ ఎందుకు మానేశావ్ అని అడుగుతూనే ఉన్నారు. అటు సినిమాలతో బిజీ అయినా సుధీర్ ఇప్పుడు స్టార్ మా సూపర్ సింగెర్స్ జూనియర్ షో కి హోస్ట్ గా అనసూయతో కలిసి కాలు పెట్టాడు. స్టార్ మా స్టేజ్ మీద అడుగుపెట్టాడో లేడో.. ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మిస్ అయ్యాడు. శ్రీదేవి డ్రామా కంపెనీకి హోస్ట్ గా వస్తున్న సుధీర్ ఈ వారం కనిపించలేదు.

సుధీర్ ప్లేస్ లో రష్మీ హోస్ట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరిసింది. స్టేజ్ పైనే ఆది నువ్వు మావాడు కొన్ని రోజులు అటు ఇటు అన్నట్టుగా ఎమన్నా మట్లాడుకున్నారా అంటూ జోక్ కూడా చేసాడు. అంటే ఇకపై సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించే అవకాశం లేకపోవచ్చు అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే స్టార్ మా కి వెళ్లిన సుధీర్ ఇకపై శ్రీదేవి డ్రామా కంపెనీకి రారు అని, జబర్దస్త్ నుండి కూడా సుధీర్ వెళ్లిపోవచ్చనే ఊహాగానాలు మొదలైనాయి.

Sudheer quits Sridevi Drama company?:

Sudigali Sudheer quits Jabardasth and Sridevi Drama company

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ