నటి పూర్ణ ఇప్పుడు పెళ్లి పీటలెక్కడానికి రెడీగా ఉంది. బిజినెస్ మ్యాన్ తో ఏడడుగులు నడిచేందుకు రంగం సిద్ధం చేసుకుని అఫీషియల్ గా తనకు కాబోయే భర్తని పరిచయం చేసింది. హీరోయిన్ గా కనిపించిన పూర్ణ కి తర్వాత వెండితెర అవకాశాలు సన్నగిల్లడంతో టివి షోస్ కి పరిమితమైంది. మధ్యలో వెండితెర అవకాశాల కోసం వెయిట్ చేస్తూ టివి షోస్ కి జేడ్జ్ గా వ్యవహరించింది. ఢీ డాన్స్ షోకి కొన్నేళ్లుగా జేడ్జ్ గా కొనసాగింది. తర్వాత ఢీ డాన్స్ షో నుండి తప్పుకుని అప్పుడప్పుడు జబర్దస్త్ స్టేజ్ పై అలాగే స్టార్ మా కామెడీ స్టార్స్ లోను కనిపిస్తుంది.
అయితే తాజాగా పూర్ణ తానెందుకు ఢీ డాన్స్ షో మానెయ్యాల్సి వచ్చిందో కారణం చెప్పి షాకిచ్చింది. తాను ఢీ డాన్స్ నుండి తప్పుకున్నది కేవలం హగ్గులు ఇవ్వలేకే అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. డాన్స్ బాగా చేసారని చెప్తే వాళ్ళకి హాగ్ ఇవ్వాలని, డాన్స్ మాస్టర్స్ కి యాంకర్స్ ఇలా హగ్స్ ఇవ్వడం ఇష్టం లేకనే తాను ఢీ షో నుండి తప్పుకున్నట్టుగా సంచలన వ్యాఖ్యలు చేసింది పూర్ణ. అవునా అందుకేనా పూర్ణ ఢీ షోలో కనిపించడం లేదు అంటూ నెటిజెన్స్ పూర్ణ కామెంట్స్ పై స్పందిస్తున్నారు.