కెజిఎఫ్ కి సీక్వెల్ గా ఏప్రిల్ 14 న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా మూవీ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన కెజిఎఫ్ చాప్టర్ 2 విడుదలైన అన్ని భాషల్లోనూ విజయ బావుటా ఎగరెయ్యడమే కాదు, కెజిఎఫ్ కలెక్షన్స్ కి నార్త్ హీరోలకి కళ్ళు తిరిగిపోయాయి. సౌత్ మీదున్న చిన్న చూపు ట్రిపుల్ ఆర్, కెజిఎఫ్ 2 సినిమాలు పోగొట్టేశాయి. రాఖి భాయ్ యాక్షన్ కి మాస్ ఆడియన్స్ థియేటర్స్ లో విజిల్స్ వేశారు. ప్రభాస్ నీల్ హీరో ఎలివేషన్ సీన్స్ కి మాస్ ప్రేక్షకులు జేజేలు పలికారు. అంతలాంటి భారీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా కెజిఎఫ్2 నిలిచింది.
నేటితో కెజిఎఫ్ 2 50 రోజులని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇండియా లో 390+ సెంటర్స్ లోను, ఓవర్సీస్ లో 10+ సెంటర్స్ లో కెజిఎఫ్ చాప్టర్ 2 సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది. 50 రోజులకి గాను కెజిఎఫ్ 2 వరల్డ్ వైడ్ గా 1235 కోట్లు కొల్లగొట్టినట్లుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ వదిలారు. KGF థియేట్రికల్ రన్ ముగియడంతో రేపటినుండి కెజిఎఫ్ 2 ప్రతి ఇంట్లోనూ అంటే అమెజాన్ ప్రైమ్ యూజర్స్ ఉన్న ఇంట్లో సందడి చేయబోతుంది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుండి కెజిఎఫ్2 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.