Advertisementt

త్వరలోనే అల్లు అర్జున్ తో అక్షయ్ సినిమా

Thu 02nd Jun 2022 09:04 PM
allu arjun,akshay kumar,south movies,north movies,pan india films  త్వరలోనే అల్లు అర్జున్ తో అక్షయ్ సినిమా
Will Akshay Kumar and Allu Arjun work together? త్వరలోనే అల్లు అర్జున్ తో అక్షయ్ సినిమా
Advertisement
Ads by CJ

ఈమధ్యన సౌత్ vs నార్త్ అన్న రేంజ్ లో హీరోల మధ్యన గొడవలు జరుగుతుంటే.. హీరో సిద్దార్థ్ పాన్ ఇండియా అంటేనే ట్రాష్.. అంతా ఇండియన్ సినిమానే అంటూ మాట్లాడాడు. సుదీప్, అజయ్ దేవగన్ మధ్యన పాన్ ఇండియా యుద్ధం నడిచింది. ఇలాంటి సమయంలో పృథ్వీరాజ్ ప్రమోషన్స్ లో అక్షయ కుమార్ సౌత్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. అక్షయ్ మాట్లాడుతూ దేశాన్ని విభజించి పాలించినట్లుగా సినిమా ఇండస్ట్రీని సౌత్ నార్త్ అంటూ విభజించడం మానెయ్యండి.

ఇక్కడ సౌత్‌, నార్త్‌ అని తేడాల్లేవు.. ఉన్నది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఒక్కటే. అన్ని ప్రాంతాల ప్రేక్షకుల కోసం అన్ని సినిమా ఇండస్ట్రీలు కలిసి పని చేస్తున్నాయి. అలాగే నేను త్వరలోనే ఆలు అర్జున్ తో కలిసి సినిమా చెయ్యడమే కాదు, మరో సౌత్ హీరో సినిమాలో నటించినా నటించవచ్చు.. ఇకపై జరిగేది ఇదే అంటూ అక్షయ్ కుమార్ సంచలనంగా మాట్లాడాడు.

అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా ఫిలిం తో బాలీవుడ్ ని చెడుగుడు ఆడేసాడు. ఎలాంటి అంచనాలు, ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే పుష్ప తో 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టాడు. దానితో అక్కడి హీరోయిన్స్ అల్లు అర్జున్ ని పొగిడెయ్యడమే కాదు, ఆయనతో సినిమాలు చేసేందుకు యమా ఉత్సాహంగా ఉన్నారు. ఇక హీరో అక్షయ్ కుమార్ అయితే పుష్ప సినిమా చూసి అల్లు అర్జున్ ని పొగిడేశారు. తాజాగా అక్షయ్ అల్లు అర్జున్ తో కలిసి పనిచెయ్యవచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

Will Akshay Kumar and Allu Arjun work together?:

Allu Arjun should do a film with me: Akshay Kumar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ