గత రెండు వారాలుగా సుడిగాలి సుధీర్ జబర్దస్త్ స్టేజ్ పై కనిపించడం లేదు. సుధీర్ తో పాటుగా గెటప్ శ్రీను కూడా బ్రేక్ తీసుకున్నారు అని రామ్ ప్రసాద్ చెబుతున్నాడు కానీ.. శ్రీను, సుధీర్ ఆల్మోస్ట్ జబర్దస్త్ వదిలేశారని, సుడిగాలి సుధీర్ టీం ఇక ఉండదు అంటూ ప్రచారం జరుగుతుంది. సుడిగాలి సుధీర్ మెల్లగా ఈటీవికి దూరంగా జరుగుతున్నాడని, అందుకే ఢీ షో ఎప్పుడో మానేశాడని, రీసెంట్ గా జబర్దస్త్ లో మానేసిన సుధీర్ ఇకపై శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించడం లేదు.
గతంలో ఎంతగా సినిమాలతో బిజీగా ఉన్నా జబర్దస్త్ కి అస్సలు దూరం అవ్వలేదు. కానీ ఇప్పుడు సుధీర్ జబర్దస్త్ కి దూరంగా కనిపిస్తున్నాడు. మరి ఖాళీ లేదు అనుకుంటే స్టార్ మా లో ప్రసారం అయ్యే సూపర్ సింగర్ జూనియర్స్ కి యాంకర్ గా రాడు. ఇందులో నిజముందో కానీ.. సుధీర్ మాత్రం ఈటీవికి, మల్లెమాలకి ఆల్మోస్ట్ బై బై చెప్పేసినట్లే అంటున్నారు. ఇకపై స్టార్ మా ప్రోగ్రామ్స్ లో తరచుగా కనబడవచ్చని అంటున్నారు. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ముక్కు అవినాష్ సుధీర్ అండ్ శ్రీను లు జబర్దస్త్ ని వదిలేస్తున్నారని నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఇతర అవకాశాలతో సుధీర్ తో కాస్త గ్యాప్ వచ్చింది. ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళకి ఉండాలి అంటే ఉంటారు, లేదంటే లేదు అంటూ అవినాష్ మాట్లాడాడు. దీనిని బట్టి సుధీర్ వాళ్ళు ఇకపై జబర్దస్త్ లో ఉండకపోవచ్చు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.