కమల హాసన్ హీరోగా విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ విలన్స్ గా లోకేష్ కానగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ ప్యాకెడ్ విక్రమ్ నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ పోస్టర్స్, గ్లిమ్ప్స్, విక్రమ్ ట్రైలర్ తోనే కాకుండా ప్రమోషన్స్ తోనూ సినిమాపై అంచనాలు పెంచేసిన టీం కి ఆడియన్స్ కూడా అదిరిపోయే టాక్ ఇచ్చేస్తున్నారు. ఓవర్సీస్ ప్రీమియర్స్ ఇప్పటికే పూర్తవడంతో విక్రమ్ ఓవర్సీస్ టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కమల్ హాసన్ మూడున్నరేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తుండడంతో ఆయన ఫాన్స్ థియేటర్స్ లో గోల గోల చేస్తూ సినిమా ని వీక్షించారని అంటున్నారు.
సినిమా ఫస్ట్ హాఫ్ లో కమల్ హాసన్ కి చాలా తక్కువ నిడివి ఉంది అని, మొత్తం విజయ్ సేతుపతి - ఫహద్ ఫాసిల్ సన్నివేశాల తోనే సాగింది అని, అసలు కమల్ సినిమానేనా అనే డౌట్ వచ్చేలా ఫస్ట్ హాఫ్ ఉంది అంటున్నారు. ఇక ఫస్టాఫ్ మొత్తం టెర్రిఫిక్ ఇంట్రో సీన్‌లతో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్‌తో యాక్షన్ ప్యాక్‌లా సాగిపోతుందట. సూర్య, కార్తి పాత్రలు ఆశ్చర్యానికి గురి చేస్తాయని అంటున్నారు. ఇక, అనిరుధ్ బ్యాగ్రౌండ్, యాక్షన్ సీన్స్ సూపర్ అని టాక్. అయితే, సెకెండాఫ్‌లో విక్రమ్ కి కొంత ల్యాగ్ మైనస్ అయిందట. ఇంటర్వెల్ బ్లాక్ అయితే పీక్స్ అని కామెంట్స్ పెడుతున్నారు. డైరెక్టర్ మేజిక్, స్క్రీన్ ప్లే, కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాసిల్ యాక్టింగ్‌తో పాటు అనిరుద్ మ్యూజిక్ సినిమాకి మెయిన్ హైలెట్స్ గా చెబుతున్నారు విక్రమ్ వీక్షించిన ఆడియన్స్.