Advertisementt

బిందు మాధవి భారీ పారితోషకం

Sat 04th Jun 2022 08:50 PM
bigg boss,bindu madhavi,bigg boss ott winner  బిందు మాధవి భారీ పారితోషకం
Bindu Madhavi huge remuneration బిందు మాధవి భారీ పారితోషకం
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ కి వెళ్ళకముందు బిందు మాధవికి సినిమాల్లో పెద్దగా ఆఫర్స్ లేకుండే. బిందు మాధవి క్రేజ్ నెమ్మదిగా తగ్గిపోయింది. ఆమెని టాలీవుడ్, కోలీవుడ్ కూడా లైట్ తీసుకుంది. తెలుగులోనూ, కోలీవుడ్ లోను బిందు మాధవికి ఓ అన్నంత ఆఫర్స్ అయితే రాలేదు. అప్పుడప్పుడు సినిమాలు చేసి ఆఫర్స్ సన్నగిలిన టైం లో ఆమెకి బిగ్ బాస్ ఓటిటి ఆఫర్ రావడంతో ఆడపులిలా టైటిల్ గెలవడంతో ఒక్కసారిగా బిందు మాధవి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. 

అనిల్ రావిపూడి తన సినిమా ఛాన్స్ ఇస్తా అంటూ మాటిచ్చేసారు. అది కూడా బాలయ్య మూవీలోనే బిందు మాధవికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది కూడా. మరోపక్క బిందు మాధవికి విమెన్ సెంట్రిక్ కథలు కూడా వస్తున్నాయట. అలాగే పెద్ద స్టార్స్ సినిమాలో సపోర్టింగ్ రోల్స్ వస్తున్నాయని అంటున్నా బిందు మాధవి ఇంతవరకు ఒక్క ప్రాజెక్ట్ ఓకె చేసిన సందర్భం లేదు కానీ, బిందు మాధవి తనకి ఆఫర్స్ ఇస్తున్న మూవీస్ లో చెయ్యాలంటే 40 లక్షలు డిమాండ్ చేస్తుంది అంటున్నారు. గతంలో హీరోయిన్ గా 20నుండి 30 లక్షలు తీసుకున్న బిందు మాధవి ఇప్పుడు బిగ్ బాస్ క్రేజ్ ని వాడాలని చూస్తుందట. మరి నిజంగానే బిందు కి ఆఫర్స్ వస్తున్నాయా.. ఆమె అంత ఎక్కువ డిమాండ్ చేస్తుందా ..అనేది ఇప్పుడు ఇంటిజెన్స్ ముందున్న సందేహాలు.

Bindu Madhavi huge remuneration:

Bigg Boss winner Bindu Madhavi Demanding Huge Remuneration.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ