మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ని వివాహమాడిన తర్వాత కళ్యాణ్ దేవ్ కూడా హీరో గా మారి విజేత గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. కళ్యాణ్ దేవ్ శ్రీజ ని పెళ్లి చేసుకుంది మెగా ఫ్యామిలీ అండ తో హీరోగా మారేందుకే లేదంటే ఒకసారి పెళ్ళై పిల్ల ఉన్న శ్రీజని కళ్యాణ్ దేవ్ ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఓకె శ్రీజని ప్రేమగా చూసుకుంటూ ఒక పాప కి జన్మనిచ్చారు శ్రీజ - కళ్యాణ్ దేవ్. తర్వాత కళ్యాణ్ దేవ్ వరస సినిమాలతో బిజీ అయ్యాడు. సూపర్ మచ్చి, అలాగే కిన్నెరసాని అంటూ హడావిడి చేసాడు. గత ఏడాది అక్టోబర్ నుండి చిరు చిన్న కూతురు శ్రీజ తో భర్త కళ్యాణ్ దేవ్ కి పొసగడం లేదు అంటూ వార్తలు రావడం, అంతలోనే శ్రీజ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి కళ్యాణ్ దేవ్ పేరు తొలగించి కొణిదెల పేరుని తగిలించడం చెయ్యడంతో వారికి విడాకులు కాబోతున్నాయని అన్నప్పటికీ మెగా ఫ్యామిలీ నుండి ఎలాంటి స్పందన లేదు.
అటు కళ్యాణ్ దేవ్ ఒంటరిగానే ఉంటున్నాడు. ఆ తర్వాత వచ్చిన సూపర్ మచ్చి థియేటర్స్ లోకి వచ్చి వెళ్లిన విషయం కూడా ఎవరికీ గుర్తులేదు. ఇక మెగా ఫ్యామిలీకి దూరమైన కళ్యాణ్ దేవ్ ని దర్శకనిర్మాతలు లైట్ తీసుకున్నారు. కళ్యాణ్ దేవ్ తదుపరి చిత్రం కిన్నెరసాని గత ఏడాది ప్రమోషన్స్ మొదలు పెట్టి థియేటర్స్ లో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ గత ఆరు నెలలుగా చడీ చప్పుడు లేదు. తాజాగా కిన్నెరసాని ఓటిటి రిలీజ్ అంటూ ఓ న్యూస్ వచ్చేసింది. అదిగో మెగా ఫ్యామిలీ తో విభేదాలు కారణంగానే కళ్యాణ్ దేవ్ సినిమాని ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే నిర్మాతలు దానిని ఓటిటి రిలీజ్ చేస్తున్నారంటూ మళ్ళీ సోషల్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. ఇకపై కళ్యాణ్ దేవ్ కెరీర్ క్లోజ్ అయినట్లే అని కూడా అంటున్నారు.