పూరి జగన్నాధ్ డ్రీం ప్రాజెక్ట్ అనుకున్న ఇన్నాళ్ళకి విజయ్ దేవరకొండ హీరోగా పట్టాలెక్కింది. అయితే పూరి జగన్నాధ్ జన గణ మన ఇంకా మొదలు కాకముందే మలయాళంలో పృథ్వీ రాజ్ సుకుమారన్ హీరోగా జన గణ మన తెరకెక్కడం థియేటర్స్ లో రిలీజ్ అయ్యి హిట్ అవ్వడం ఇప్పుడు ఓటిటి నెట్ ఫ్లిక్స్ లోకి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోకి అందుబాటులోకి వచ్చెయ్యడం జరిగింది. నెట్ ఫ్లిక్స్ లో జన గణ మన చిత్రాన్ని ఓటిటి ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. తెలుగులో జన 22 గా ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోలీస్ ఆఫీసర్ గా, లాయర్ గా కనిపించారు. మరో నటుడు సూరజ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు.
అయితే జన గణ మన మొత్తం సూరజ్ పాయింట్ అఫ్ వ్యూ లో సాగింది. పృథ్వీ రాజ్ పోలీస్ ఆఫీసర్ గా సస్పెండ్ అయ్యి ఎందుకు జైలు కి వెళ్ళాడు. అతని పర్సనల్ లైఫ్ ఏమిటి, జైలుకెళ్లిన పృథ్వీ రాజ్ సుకుమారన్ అరవింద్ గా లాయర్ అవరం ఎలా ఎత్తాడు అనేది జన గణ మన లో చూపించలేదు. ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే పార్ట్ 2 ఖచ్చితంగా ఉండాలి. కానీ పృథ్వీ రాజ్ మాత్రం జన గణ మన పార్ట్ 2 గురించి ఎక్కడ చెప్పలేదు. క్లూ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు జన గణ మన సినిమాని నెట్ ఫ్లిక్స్ లో వీక్షించిన ఆడియన్స్ మాత్రం పార్ట్ 2 ఉంటుందా? ఉండదా? అనే సస్పెన్స్ లో ఉన్నారు.