నయనతార - విగ్నేష్ శివన్ ల పెళ్లి ఏర్పాట్లు చక చకా జరిగిపోతున్నాయి. గత కొన్నేళ్ల ప్రేమ పెళ్లి పీటలెక్కబోతుంది. జూన్ 9 న నయనతార - విగ్నేష్ శివన్ ల జంట మహాబలి పురంలోని ఓ రిసార్ట్స్ లో పెళ్లాడబోతున్నట్లుగా తెలుస్తుంది. అటు పెళ్లి పనులు, ఇటు పెళ్లి పిలుపులు జోరుగా సాగుతున్నా ఈ జంట మాత్రం మీడియాకి అఫీషియల్ గా పెళ్లి విషయం చెప్పకుండా ఇంకా ఇంకా సీక్రెట్ మెయింటింగ్ చేస్తూనే ఉన్నారు. నయనతార - విగ్నేష్ లు కలిసే పెళ్లి పత్రికలు పంచుతున్నారు. అయితే వీరి పెళ్లి చాలా సింపుల్ గా అంటే కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్యనే జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. తక్కువమందిని పెళ్ళికి ఆహ్వానించినా పెళ్లి మాత్రం గ్రాండ్ గానే చేసుకుంటుందట ఈ జంట.
ఇప్పటికే కొందరు అతిథులకు డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్ ని అందించిన ఈ జంట ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ ని స్వయంగా కలిసి పెళ్ళికి ఆహ్వానించినట్లుగా పైన కనిపిస్తున్న ఫోటో చూస్తుంటే తెలుస్తుంది. నయనతార తమ పెళ్ళికి తప్పకుండా రావాలని సీఎం స్టాలిన్ ని కోరినట్లుగా చెబుతున్నారు. విగ్నేష్ - నయన్ తమ పెళ్లి కార్డుని, బొకేని సీఎం స్టాలిన్ కి ఇస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.