Advertisementt

యశ్ నెక్స్ట్ పై ఇంకా క్లారిటీ లేదు

Mon 06th Jun 2022 10:51 AM
kgf 2,yash,kgf star yash,yash next movie  యశ్ నెక్స్ట్ పై ఇంకా క్లారిటీ లేదు
There is no clarity yet on Yash Next యశ్ నెక్స్ట్ పై ఇంకా క్లారిటీ లేదు
Advertisement
Ads by CJ

కెజిఎఫ్ 2 తో సంచనాలు సృష్టించిన పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ షూటింగ్ లో హైదరాబాద్ లో బిజీ అయ్యారు. బర్త్ డే వేడుకల కోసం ప్రశాంత్ నీల్ బెంగుళూరు వెళ్లి మళ్ళీ హైదరాబాద్ కి వచ్చి సలార్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. మరోపక్క NTR31 అంటూ ఫస్ట్ లుక్ వదిలి ఇటు ఎన్టీఆర్ ఫాన్స్ ని బుట్టలో వేసుకున్నారు. అలాగే కెజిఎఫ్ 2 రిలీజ్ అయ్యి 50 డేస్ పూర్తయ్యింది కూడా. కానీ హీరో యశ్ మాత్రం ఇంతవరకు తన కొత్త సినిమాని మొదలు పెట్టలేదు. కనీసం యశ్ నెక్స్ట్ సినిమా ఏమిటి అనేది కూడా అనౌన్సమెంట్ లేదు. 

యశ్ ఏ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు, ఎలాంటి జోనర్ ని ఎంచుకుంటాడనే ఆత్రుత కన్నడ ప్రేక్షకుల్లోనూ యశ్ ఫాన్స్ లోనే కాదు, ఇండియా వైడ్ గా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ యశ్ నెక్స్ట్ పై చిన్నపాటి క్లూ కూడా లేదు. కెజిఎఫ్ రిలీజ్ అయ్యి రెండు నెలలు అవుతున్నాయి. కానీ యశ్ ఇంకా ఇంకా నెక్స్ట్ విషయంలో క్లారిటీకి రాకుండా కన్ఫ్యూజ్ అవుతున్నాడా అనే అనుమానాలు ఫాన్స్ లో వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్యనే కెజిఎఫ్ నిర్మాతలు యశ్ నెక్స్ట్ మూవీ ఎనౌన్సమెంట్ ఉండబోతుంది అన్నారు. కానీ యశ్ ఇంకా ఆ విషయమై స్పష్టతనివ్వడంలేదు.

There is no clarity yet on Yash Next:

No clarity on KGF star Yash next movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ