పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరస ప్రాజెక్ట్స్ తో ఫాన్స్ లో జోష్ నింపుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, సలార్ సినిమాలు సెట్స్ మీదున్నాయి. మరోపక్క సందీప్ వంగాతో స్పిరిట్, మారుతీ తో మరో మూవీ ని లైన్ లో ఉంచుకున్నారు ప్రభాస్. ఈలోపు కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కథ చెప్పగా ప్రభాస్ రిజెక్ట్ చేశారని న్యూస్ నడుస్తుండగానే.. ప్రభాస్ మరో మూవీని ఓకె చేసేసారు. అది కూడా బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో.
ప్రభాస్ - సిద్ధార్థ్ ఆనంద్ కాంబో మూవీ ని మైత్రీ మూవీమేకర్స్ నిర్మించబోతున్నారు. ఈ మూవీ యాక్షన్ డ్రామా గా ఉండబోతుంది. ఇంతకుముందే సిద్దార్థ్ తో ప్రభాస్ మూవీ అన్నప్పటికీ.. అది అఫీషియల్ ప్రకటన రాలేదు. కానీ తాజాగా ప్రభాస్ - సిద్ధార్థ్ ఆనంద్ మూవీ ఫిక్స్ అని తెలుస్తుంది. ప్రభాస్ లైనప్ లో ఉన్న మూవీస్ అన్ని పూర్తయ్యాక సిద్దార్థ్ ఆనంద్ తో ప్రభాస్ మూవీ పట్టాలెక్కబోతుందట. ఈ మూవీ యాక్షన్ ప్రధానంగా, హాలివుడ్ రేంజ్ ఫైట్స్ తో ఉండబోతుంది అని తెలుస్తుంది. ఈ న్యూస్ చూసాక ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.